News October 29, 2024

నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. సిక్కోలు వాసి మృతి

image

నెల్లూరులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన గిన్ని కృష్ణారావు(48) మృతిచెందాడు. గత కొన్నేళ్లుగా నెల్లూరులో రైస్ మిల్లులో పనిచేస్తున్న ఈయన రహదారి దాటుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందాడు. మృతదేహానికి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం సోమవారం రాత్రికి గ్రామానికి తీసుకొచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Similar News

News February 15, 2026

జేఎన్టీయూ హాస్టల్‌లో శ్రీకాకుళం విద్యార్థిని సూసైడ్

image

కాకినాడ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఏ.అరుణ(19) ఇవాళ సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు సర్పవరం పోలీసులు తెలిపారు. జేఎన్టీయులోని నాగవల్లి లేడీస్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతురాలిది శ్రీకాకుళం జిల్లా పాలసింగి గ్రామం అని చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. కేసుపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

News February 15, 2026

శ్రీకాకుళం: ఉద్యోగం పేరిట మహిళకు మోసం

image

ఉద్యోగాల పేరుతో తనతో పాటు మరికొందరు మోసపోయినట్లు శ్రీకాకుళంలోని బొందిలిపురానికి చెందిన ఎం. విజయలక్ష్మి శనివారం 2టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గోపాల్ రెడ్డి, నాగేంద్ర రెడ్డి ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 15 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వద్ద మరిన్ని వివరాలు సేకరించి టూ టౌన్ సీఐ ఈశ్వర్ రావు కేసు నమోదు చేశారు.

News February 15, 2026

పలాస కళాకారుడి అద్భుతం.. !

image

మహాశివరాత్రి పురస్కరించుకొని పలాసకు చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేశ్ ఆచారి తన అద్భుత కళాఖండంతో భక్తిని చాటుకున్నారు. పెన్సిల్ మొనపై శివలింగం, ఓంకారాన్ని అత్యంత సుందరంగా చెక్కి అందరినీ అబ్బురపరిచారు. సుమారు 5 గంటల శ్రమతో రూపొందించిన ఈ సూక్ష్మ శిల్పం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ రథసప్తమి లోగో, అతిచిన్న ప్రపంచ కప్ వంటి ఆకృతులతో రమేశ్ తన ప్రతిభను నిరూపించుకున్నారు.