News July 25, 2024

నెల్లూరులో లీలామహల్ కనుమరుగు?

image

నెల్లూరులో ఎన్ని సినిమా హాళ్లు ఉన్నా.. అందరికీ లీలామహల్ అంటేనే ఇష్టం. అంతలా ఈ థియేటర్ సింహపురి ప్రజల మన్ననలు పొందింది. వారం క్రితమే ఇక్కడ సినిమాలు వేయడం ఆపేశారు. దానిని పడగొట్టి కొత్తగా మాల్ ఏర్పాటు చేయనున్నారు. 1960లో ప్రారంభమైన లీలామహల్లో పోకిరి 175, నువ్వేకావాలి 265 రోజులు ఆడింది. ఎన్నో అద్భుత సినిమాలు ప్రదర్శించిన లీలామహల్‌‌తో మీకు ఎంత అనుబంధం ఉందో కామెంట్ చేయండి.

Similar News

News February 26, 2026

NLR: గురుకులాల ప్రవేశ పరీక్ష వాయిదా

image

గురుకులాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మార్చి 2న ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అదే నెల 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఆ సంస్థ నెల్లూరు జిల్లా సమన్వయకర్త ప్రభావతమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ 2 పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

YCPలోనే ఆదాల.. పార్టీ మార్పు లేనట్లే!

image

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. వైసీపీని వీడి బీజేపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇవాళ నెల్లూరుకు వచ్చిన జగన్‌ను ఆదాల కలిశారు. దీంతో మాజీ MP పార్టీ మార్పు ఊహాగానాలకు చెక్ పడింది.