News October 8, 2025

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ ఓపెనింగ్ ఎప్పుడో..?

image

పొదుపు మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో నెల్లూరులో పైలట్ ప్రాజెక్టుగా <<17847829>>స్మార్ట్ స్ట్రీట్<<>> ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో చాలా రోజుల కిందటే అక్కడి దుకాణాల ముందు భాగాలను తొలగించారు. కంటైనర్లతో స్మార్ట్ దుకాణాలు ఏర్పాటు చేశారు. దసరా తర్వాత ప్రారంభించాలని 4వ తేదీన ముహూర్తం కుదిర్చారు. ఏమైందో ఏమో ఓపెనింగ్‌ను మర్చిపోయారు. వీటిని ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో చూడాలి మరి.

Similar News

News April 5, 2026

TDPలోనే ఉంటాం: నెల్లూరు MP

image

జగన్‌ను కలిసే విషయయై YCP రాజ్యసభ MP అయోధ్య రామిరెడ్డితో నెల్లూరు MP వేమిరెడ్డి చర్చించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ‘మాకు కావాల్సింది గౌరవం. TDP ప్రభుత్వంలో చాలా గౌరవంగా ఉన్నాం. ఇదే పార్టీలోనే కొనసాగుతాం. రాజధానిపై YCPకి స్పష్టతలేదు. మావిగన్ అంటే జనాలు నవ్వుతున్నారు. తమిళనాడు బోట్లను అడ్డుకోవడానికి త్వరలో నెల్లూరుకు 2, తిరుపతి, బాపట్లకు ఒక్కోటి చొప్పున బోట్లు ఇస్తాం’ అని వేమిరెడ్డి చెప్పారు.

News April 5, 2026

నెల్లూరు జిల్లాలో వారసులు ఎంట్రీ ఇస్తారా…?

image

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తన తమ్ముడు గిరిధర్ రెడ్డి బరిలో ఉంటారని MLA శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు. మహిళకు రిజర్వ్ అయితే తన కుమార్తె లక్ష్మీహైందవి, వైష్ణవి, గిరిధర్ కుమార్తె సాయి శశిర రెడ్డిలో ఒకరికి టికెట్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారంట. గత ఎన్నికల్లో ప్రచారం చేసిన మంత్రులు ఆనం, నారాయణ కుమార్తెలు కైవల్య, షరిణి, సోమిరెడ్డి కోడలు శ్రుతిరెడ్డి సైతం బరిలో ఉంటారని ఉహాగానాలు మొదలయ్యాయి.

News April 5, 2026

నెల్లూరు: ఇంటర్న్‌షిప్.. నెలకు రూ.15 వేలు

image

నెల్లూరు జిల్లాలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ఫేజ్-3కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపికైన వారికి రూ.9వేలు, స్టైపెండ్, రూ.6వేలు గ్రాంట్, ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాక సర్టిఫికెట్ అందజేస్తారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివి వయసు 18-25 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు అర్హులు. ఏప్రిల్ 15వ తేదీ లోపు pminternship.mygov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.