News September 3, 2025
నెల్లూరులో 20% తక్కువ వర్షపాతం

ఆగస్టు నెలలో 3 అల్పపీడనాలు ఏర్పడి రాష్ట్రంలోని 25 జిల్లాలపై వర్షాలు ప్రభావం చూపాయి. వాటిలో 6 జిల్లాల్లో 20% నుంచి 50% వరకు వర్షపాతం నమోదైంది. అయితే ఒక్క నెల్లూరులో మాత్రమే 20% కంటే తక్కువ వర్షపాతం నమోదు అయింది. కరువు జిల్లాగా పేరుగాంచిన అనంతపురంలో మాత్రం ఈసారి అత్యధిక వర్షపాతం నమోదైంది. గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేని విధంగా వాగులు, వంకలు పోంగిపోర్లాయి.
Similar News
News September 4, 2025
నెల్లూరు: రైతు బజారులో కిలో ఉల్లి రూ.16

నెల్లూరు జిల్లాలోని పలు రైతు బజార్లలో ఉల్లిపాయలను సబ్సీడీపై విక్రయిస్తున్నారు. పొదలకూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న రైతు బజారులో బుధవారం నుంచి కిలో రూ.16కు అందిస్తున్నట్లు నెల్లూరు మార్కెటింగ్ శాఖ ఏడీ అనితా కుమారి తెలిపారు. బయట మార్కెట్లో ఉల్లిపాయల ధర కిలో రూ.30గా ఉంది. సబ్సిడీపై రూ.16కే ఇస్తున్నామని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 4, 2025
నెల్లూరు పూర్వ కమిషనర్లపై అవినీతి ఆరోపణలు

నెల్లూరులో అపార్టుమెంట్లకు ఆక్యూపెన్సీ లేకుండానే మార్టిగేజ్(రుణాలు)లు రిలీజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 72 అపార్ట్‌మెంట్లకు సంబంధించి పూర్వ కార్పొరేషన్ కమిషనర్లు హరిత, వికాస్ మర్మత్, చెన్నుడులు రూ.18 కోట్ల మేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రస్తుత కమిషనర్ ఓ.నందన్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి.
News September 4, 2025
NLR: మిగిలిన బార్లకు నేటి నుంచి దరఖాస్తులు

నెల్లూరు జిల్లాలో మొదటి విడత ముగిసిన తర్వాత మిగిలిన బార్లకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత నెల్లూరు కలెక్టరేట్‌లో లక్కీ డిప్ తీస్తారు. నెల్లూరు, కావలి, బుచ్చి, ఆత్మకూరు, అల్లూరు ప్రాంతాల్లో 31 బార్లకు అవకాశం ఉంది.