News May 11, 2024
నెల్లూరు: అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

భారత సైన్యంలో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ జరుగుతోందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని నెల్లూరు జిల్లా ఉపాధి అధికారి రామాంజనేయులు తెలిపారు. 17 నుంచి 21 ఏళ్ల లోపు వారు అర్హులని వెల్లడించారు. నేవీలో పోస్టుకు పదో తరగతి, ట్రేడ్ మాన్ పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆన్ లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
Similar News
News April 14, 2026
నెల్లూరు: వడదెబ్బతో వ్యక్తి మృతి

ఉదయగిరిలోని దాసరపల్లిలో వడదెబ్బ తగిలి షేక్. మౌలాలి (65) మృతి చెందాడు. పొలానికి నీళ్లు కట్టడానికి 10 గంటల సమయంలో వెళ్లిన మౌలాలి పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. కొద్దిసేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యాధికారులు వెల్లడించారు.
News April 14, 2026
అంబేడ్కర్‌కు నివాళులర్పించిన నెల్లూరు కలెక్టర్

అంబేడ్కర్ జయంతి సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశానికి భారత రాజ్యాంగాన్ని ఒక దిక్సూచిగా రచించిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన దేశానికి అందించిన రాజ్యాంగం నేటికీ కొనసాగించడం అభినందనీయమన్నారు.
News April 14, 2026
ఆత్మకూరు: ఆటోలోనే డ్రైవర్ మృతి

ఆత్మకూరు శివారులోని నెల్లూరు పాలెం వద్ద సోమవారం ఆటోలోనే డ్రైవర్ జమీర్(57) మృతి చెందారు. టిట్కో గృహాల్లో నివసించే ఆయన ఉదయం ఇంటి నుంచి వెళ్లిన తర్వాత నెల్లూరు పాలెం వద్ద ఆటోలోనే విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అనారోగ్యం లేదా ఎండ తీవ్రత వల్ల మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


