News January 22, 2026

నెల్లూరు: ఆగని తల్లుల కడుపు‘కోత’.!

image

జిల్లాలో సిజేరియన్ ప్రసవాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉన్నా డబ్బుల కక్కుర్తితో డాక్టర్లు కత్తికి పనిచెబుతున్నారు. జిల్లాలో ఏటా 10 వేల వరకు ప్రసవాలు జరుగుతుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 30 వేల వరకు ఉంది. 2024-25 మధ్య దాదాపు 11 వేల వరకు సిజేరియన్‌లు జరిగాయట. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సరైన నిఘా లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందట. దీనిపై DMHO సుజాత సైతం ఆందోళన వ్యక్తం చేశారు.

Similar News

News February 15, 2026

దేశంలో ఎక్కడా లేదు.. శ్రీకాళహస్తిలోనే..!

image

శ్రీకాళహస్తి క్షేత్రంలో అనేక విశేషాలు మనకు కనిపిస్తాయి. ఆలయ ప్రధాన ముఖద్వారం, నందీశ్వరుడు, బలిపీఠంతో పాటు దారు ఏకశిలా ధ్వజస్తంభం ఉంటాయి. ధ్వజస్తంభం పైన చిన్న నంది ఉంటుంది. ఇటువంటి దారు ఏకశిలా ధ్వజస్తంభం భారతదేశంలో మరెక్కడా లేదు.

News February 15, 2026

నెల్లూరు: ​మల్లెపూలు కాదు.. తెల్లని బంగారమే!

image

నెల్లూరు జిల్లా కోట మండలంలో మల్లెపూల దిగుబడి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. తోటల నుంచి మొగ్గలు రావడం మొదలవ్వడంతో మార్కెట్‌లో కిలో మల్లెపూల ధర ఏకంగా రూ.1400 పలుకుతోంది. దిగుబడి స్వల్పంగా ఉన్నప్పటికీ, భారీ డిమాండ్ కారణంగా రైతులు వీటిని తిరుపతి, గూడూరు, చెన్నై ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో పంట లేకపోయినా, లభిస్తున్న అధిక ధరతో రైతులు అందినకాడికి విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు.

News February 15, 2026

నెల్లూరు: లేడీస్.. బీ అలర్ట్!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బంగారం ధర తులం రూ.1.60 లక్షలు దాటడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గత 6నెలల్లోనే 60కి పైగా స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఒంటరి మహిళలే లక్ష్యంగా నంబర్ ప్లేట్ లేని బైకులపై వచ్చి నగలు, తాలిబొట్లు లాకెళ్తున్నారు. తాజాగా గూడూరులో ఓ టీచర్‌పై బంగారం కోసం దాడి చేయడం కలకలం రేపింది. నగలు ధరించి బయటకు వెళ్లేటప్పుడు మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.