News August 14, 2025
నెల్లూరు: ఆత్మహత్య చేసుకుంటా అని పోలీసులకు కాల్..!

తన భార్య కాపురానికి రాలేదంటూ వరికుంటపాడు మండలానికి చెందిన కొమరగిరి శ్రీనివాసులు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు తక్షణమే తూర్పు బోయమడుగుల గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు పాల్పడతానన్న శ్రీనివాసులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో గాలించారు. శ్రీనివాసులు చెట్లల్లో దాగి ఉండడాన్ని గమనించిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.
Similar News
News August 14, 2025
నెల్లూరు: రేపటి నుంచి ఫ్రీ బస్సు

స్త్రీ శక్తి పేరిట ఆర్టీసీ బస్సులలో మహిళకు ఉచిత ప్రయాణం పథకాన్ని రేపటి నుంచి ప్రభుత్వం అమలు చేయబోతోంది. నెల్లూరు రీజియన్ పరిధిలో 642 బస్సులు ఉన్నాయి. వాటిలో 510 సొంత బస్సులో కాగా.. రోజుకి సుమారు 1.5 లక్షల మంది ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. రూ.95 లక్షలు రోజువారి రాబడి ఆర్టీసీకి వస్తుంది. మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కనిపిస్తే 80 శాతం మంది మహిళలు ప్రయాణించే అవకాశం ఉంటుంది.
News August 13, 2025
నెల్లూరులో యువకుడి దారుణ హత్య

నెల్లూరు అలంకార్ సెంటర్ సమీపంలోని విక్టోరియా గార్డెన్ వద్ద మూలాపేటకు చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సూరి, లక్కీ అనే ఇద్దరు యువకులు ప్రాణ స్నేహితులు. ఇటీవల వీరిద్దరి మధ్య కొంత వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే లక్కీ అనే యువకుడిని సూరి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
News August 13, 2025
LRS సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్

జూన్ 30, 2025 కంటే ముందు అనధికారంగా ఏర్పాటైన లేఅవుట్లు, ప్లాట్లను చట్టబద్ధంగా క్రమబద్ధీకరించే సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని మండల తహశీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు, నుడా (NUDA) కార్యాలయాలను సంప్రదించాలన్నారు. http://apdpms.ap.gov.in/ లేదా http://nudaap.org/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.