News March 24, 2025
నెల్లూరు: ఆన్‌లైన్‌లో పరిచయం.. రూ.18 లక్షల మోసం

హనీట్రాప్‌కు గురై ఓ వ్యక్తి రూ.18 లక్షలు పోగొట్టుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వరికుంటపాడుకు చెందిన తనకు ఆన్లైన్ ద్వారా దుర్గాభవాని అనే మహిళ పరిచయమైందని, అనారోగ్యంగా ఉందని నమ్మించి తన దగ్గర రూ.18 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని వాపోయాడు. ఈ మేరకు సోమవారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశాడు.
Similar News
News January 7, 2026
నెల్లూరు: మత్స్యకారులకు నావిగేషన్ పరికరాలు

నెల్లూరు జిల్లాలో మత్స్యకారులకు భద్రతతో పాటు చేపలు ఉండే ప్రాంతాన్ని పసిగట్టే నావిగేషన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. జిల్లాలో 3వేల బోట్లకు వీటిని అమర్చనుంది. నెల్లూరులోని జిల్లా మత్స్య శాఖ ఆఫీసుకు ఈ పరికరాలు వచ్చాయి. వీటిని బోట్లకు అమర్చడంతో మత్స్సకారులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
News January 6, 2026
నెల్లూరు: MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

వేరుశనగ, నిమ్మ పంటలకు అనుగుణంగా MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. నెల్లూరు జడ్పీలో మంగళవారం సమావేశం జరిగింది. ఎలాంటి గ్యారంటీలు లేకుండా MSMEలకు రుణాలు ఇవ్వడం లేదని చర్చ జరిగింది. MSME రుణాల మంజూరుకు మార్జిన్ మనీ ఇస్తామని.. రుణాలు త్వరగా ఇవ్వాలని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు కోరారు.
News January 6, 2026
నెల్లూరు కలెక్టర్ ఐడియా సూపర్..!

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సరికొత్త ఐడియాలతో ముందుకు వెళ్తున్నారు. ఛాంపియన్ ఫార్మర్, కిసాన్ సెల్‌తో ఇతర కలెక్టర్లకు ఆదర్శంగా మారారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ‘వన్ మంత్.. వన్ విలేజ్ ఫోర్ విజిట్స్’కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అధికారులు ఓ గ్రామానికి నెలకు 4సార్లు వెళ్లి సమస్యలు తెలుసుకుంటారు. బుచ్చి మండలం మినగల్లులో ఈ కార్యక్రమాన్ని తహశీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు.


