News February 15, 2026

నెల్లూరు: ఆ ఊరిలో మద్యానికి నో ఎంట్రీ..!

image

నెల్లూరు రూరల్ పాత వెల్లంటి రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా పేరు పొందింది. 30 ఏళ్లుగా ఆ గ్రామంలోకి మద్యం అనుమతించడం లేదు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే రూ.10వేలు జరిమానా విధిస్తారు. గ్రామ పరిసరాల్లో బెల్ట్ షాపు నిర్వహిస్తే వారిని గ్రామస్థులే పోలీసులకు అప్పగిస్తారు. 1994 నుంచి సీపీఎం అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఉన్నారు. ప్రస్తుత యువత పెద్దల కట్టుబాట్లను కొనసాగించడం విశేషం.

Similar News

News February 17, 2026

నెల్లూరు మేయర్‌గా మరోసారి మహిళకే ఛాన్స్!

image

నెల్లూరు మేయర్‌గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత పేరు వినబడుతుంది. మాజీ మేయర్ స్రవంతిని అవిశ్వాసం పెట్టి దించిన తర్వాత.. అదే సామాజిక వర్గానికి చెందిన ఈమెను TDP తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఎస్టీ జనరల్‌కు కేటాయించినా.. మహిళకే ప్రాధాన్యం ఇస్తే ఈమె ముందు వరుసలో ఉంది. TDP తరఫున 47 మంది, YCP నుంచి ఏడుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నారు. వీరు 26న జరిగే సమావేశంలో మేయర్‌ను ఎన్నుకోనున్నారు.

News February 17, 2026

కనుపూరు ముత్యాలమ్మ జాతర ఎప్పుడో తెలుసా..

image

చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మార్చి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు ప్రసిద్ధిగాంచారు. ఈ జాతరకు ఏటా 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షలు పొందుతారు. ఈ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.

News February 17, 2026

నెల్లూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: RIO వరప్రసాద్

image

* ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
* నెల్లూరు జిల్లాలో 53,404 మంది ఇంటర్ విద్యార్థులు
* ఫస్ట్ ఇయర్ 26,935 మంది
* సెకండ్ ఇయర్ 26,469 మంది
* జిల్లాలో 81 పరీక్షా కేంద్రాలు
* 1150 మంది ఇన్విజిలేటర్ల నియామకం
* సిట్టింగ్ స్క్వాడ్స్ 5.. ఫ్లయింగ్ స్క్వాడ్స్ 4 ఏర్పాటు
* పరీక్షా సమయం 9AM నుంచి 12PM
* ఇప్పటికే విడుదలైన హాల్ టికెట్స్

*పరీక్షకు ఒకరోజు ముందే హాల్ టికెట్, సామాగ్రి సిద్ధం చేసుకోండి