News February 11, 2026

నెల్లూరు: ఇద్దరే విద్యార్థులు ఉన్నారని..!

image

నెల్లూరు జిల్లా వరికుంటపాడు(M) నల్లబోతులవారిపల్లి ప్రాథమిక పాఠశాల మంగళవారం మూతపడింది. ఇక్కడ ఇద్దరే చదువుతుండగా ఓ టీచర్ పనిచేస్తున్నారు. కాంచెరువు స్కూల్ టీచర్ సెలవు పెట్టడంతో నల్లబోతులవారిపల్లి టీచర్‌కు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఆయన అక్కడికి వెళ్లారు. ఇక్కడ ఇద్దరే విద్యార్థులు ఉండటంతో.. ఏ స్కూల్లో టీచర్లు లేకపోయినా నల్లబోతువారిపల్లె టీచర్‌ను తరచూ పంపిస్తూ ఇక్కడి వారిని పట్టించుకోవడం లేదు.

Similar News

News February 16, 2026

నెల్లూరు జిల్లా ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

నెల్లూరు జిల్లాలోని అన్ని శాఖల్లో అర్హత కలిగిన వారందరికీ రానున్న నెల రోజుల్లో ప్రమోషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. పానల్ జాబితాలను తయారు చేయాలని సూచించారు. కొన్ని శాఖల్లో ఎప్పటినుంచో సర్వీస్‌లో ఉంటూ ప్రమోషన్ పొందని వారు ఇంకా ఉన్నారని చెప్పారు. క్రిమినల్, శాఖా పరమైన కేసులు లేని వారందరికీ ప్రమోషన్ ఇవ్వాలని సూచించారు.

News February 16, 2026

నెల్లూరు: పరీక్షలా? క్రికెట్ మ్యాచ్‌లా?

image

10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు పరీక్షలుపై ఫోకస్ చేయాలా? మ్యాచ్‌లు చూడాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఈ నెల 17 నుంచి CBSE పరీక్షలు ప్రారంభం కానుండగా, 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. T20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మ్యాచ్‌లు చూస్తూ టీవీలకు అతుక్కుపోతున్నారు. విద్యార్థుల జీవితాల్లో ముఖ్యమైన పరీక్షలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

News February 16, 2026

నెల్లూరు: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. నెల్లూరు డివిజన్‌లో 50, గూడూరు డివిజన్‌లో 31 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470