News January 1, 2026

నెల్లూరు: ఇవాళ మీకు సెలవు ఇచ్చారా?

image

నెల్లూరు జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. చాలామంది ఇవాళ దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు వెళ్తుంటారు. ఈనేపథ్యంలో ఆప్షన్ లీవ్ వాడుకోవచ్చు. ఏడాదికి 5ఆప్షన్ హాలిడేస్ ఉంటాయి. జిల్లాలోని కొన్ని స్కూళ్లు, కాలేజీలకు గురువారం సెలవు ఇచ్చారు. మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.

Similar News

News February 19, 2026

నెల్లూరు MP నకిలీ PA అరెస్ట్..!

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పీఏనని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని 4వ పట్టణ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన నదీమ్‌గా ఎంపీ పీఏనని ప్రచారం చేసుకుంటున్నాడు. ఈక్రమంలో జమ్మలమడుగుకు చెందిన గొల్ల నరేశ్ అనే వ్యక్తిని బెదిరించాడు. వాళ్లు ఎంపీ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎంపీ కార్యాలయం తెలిపింది.

News February 19, 2026

నెల్లూరు జిల్లాలో రొయ్యలకు వైరస్

image

నెల్లూరు జిల్లాలో వాతావరణ మార్పులతో వెనామీ రొయ్యలకు వైట్ స్పాట్ వైరస్ సోకింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో రొయ్యల తలపై తెల్లటి మచ్చలు ఏర్పడి, మేత మానేస్తున్నాయి. ఆక్సిజన్ అందక రొయ్య పిల్లలు గుంటల్లోనే చనిపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. కోట, వాకాడు మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. పెట్టుబడి రాక రైతులు తక్కువ ధరకే విక్రయిస్తూ కుదేలవుతున్నారు.

News February 19, 2026

నెల్లూరు: యువకుడి డెడ్‌బాడీ లభ్యం

image

బోగోలు మండలం తాడిచెట్లపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ఉలవపాల గ్రామానికి చెందిన ఇద్దరి యువకులు గల్లంతయిన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులలో దీపక్ మృతదేహం ఆరోజే లభ్యం కాగా, నూనె లోకేశ్ అనే యువకుడు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం లోకేశ్ డెడ్ బాడీ అల్లూరు మండలం ఇసుకపల్లె సముద్ర తీరంలో లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.