News February 25, 2025

నెల్లూరు: ఈ బాల్యం బడి బాట పట్టేనా..?

image

బడి ఈడు గల పిల్లలందరూ బడిలో ఉండాలి, బాల కార్మిక వ్యవస్థ వద్దు, బడిబాట పట్టాల్సిన చిన్నారులు, పని బాట పట్టకూడదని అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం చెబుతూ ఉంటారు. కానీ అది ఆచరణలో సాధ్యం కాలేదని పలువురు విమర్శిస్తున్నారు. దుత్తలూరు మండలంలో పలువురు చిన్నారులు చెత్త కాగితాలు ఏరుకుంటూ, మరికొందరు బట్టీల వద్ద, క్రషర్ల వద్ద తమ బాల్యాన్ని ధారపోస్తున్నారు. వీరిని బడిబాట పట్టించాలని పలువురు కోరుతున్నారు.

Similar News

News February 25, 2025

శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు: SP

image

బుధవారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సకాలంలో దర్శనం చేసేలా చూడాలని సూచించారు. శివరాత్రి జాగారం సమయంలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News February 25, 2025

జగన్‌కు మేమే టికెట్లు కొనిస్తాం: సోమిరెడ్డి

image

అసెంబ్లీకి రాని YCP ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలను ఎదుర్కోవాలని సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ చేశారు. ‘జగన్ వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ఎక్కువ సేపు మాట్లాడవచ్చు. ప్రతిపక్ష నేతలకు ఫ్రీగా విమానం టికెట్, కారుకు డీజిల్, పీఏను ఇస్తారు. జగన్‌కు ఫ్రీగా విమానం టికెట్లు కావాలంటే మేమే చందాలు వేసుకుని కొనిస్తాం’ అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.

News February 25, 2025

నెల్లూరు జిల్లాకు రూ.33.52 కోట్ల విడుదల

image

నెల్లూరు జిల్లాకు 19వ విడత ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రూ.33.52 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1.68 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. ఈ నిధులు రైతుల ఖాతాలకు నేరుగా జమవుతాయని తెలిపారు. రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున నగదు జమవుతుందన్నారు.

error: Content is protected !!