News May 12, 2024
నెల్లూరు: ఎన్నికల ఎఫెక్ట్.. కల్లుకి డిమాండ్

నెల్లూరు జిల్లాలో ఎన్నికల వేళ కల్లుకి డిమాండ్ పెరిగింది. సాధారణంగా ఎండకాలంలో మందుకంటే కల్లునే ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మందు బంద్ చేయడంతో కల్లుకి డిమాండ్ పెరిగింది. కొందరు పక్క ఊర్లకి వెళ్లి మరీ తాగుతున్నారు. కొన్నిచోట్ల కల్లు దొరకకపోవడంతో మందుబాబులు వెనుతిరుగుతున్నారు. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News March 14, 2025
హోలీ పండుగ.. నెల్లూరు SP కీలక ఆదేశాలు

నెల్లూరు జిల్లా ప్రజలకు SP జి.కృష్ణకాంత్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ ప్రేమ, ఐక్యత, సంతోషాన్ని తెచ్చిపెట్టాలని ఆయన కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో పండగ నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హద్దు మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 14, 2025
భూముల వివాదాల పరిష్కారానికి కృషి చేయాలి : కలెక్టర్

ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలో అటవీ అధికారులు భాగస్వాములై ఆయా భూముల వివాదాల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా కలెక్టర్ ఆనంద్ కోరారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో అటవీ, వన్యప్రాణుల రక్షణపై సమీక్షా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సమావేశ ఉద్దేశాలను జిల్లా అటవీ శాఖాధికారి మహబూబ్ భాషా వివరించారు.
News March 13, 2025
నెల్లూరు: నిరుద్యోగులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎనర్జీ సిస్టం, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, డిప్లమా విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కలవని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ జిల్లా మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం తెలిపారు. 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు అర్హులని అన్నారు. మరింత సమాచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.