News November 29, 2025

నెల్లూరు: ఎమ్మార్వో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

నెల్లూరు గ్రామీణ మండల పరిధిలో దిత్వా తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు పడే అవకాశమున్నందున రూరల్ ఎమ్మార్వో కృష్ణ ప్రసాద్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు తక్షణ సహాయ చర్యలు అందించేందుకు, అత్యవసర పరిస్థితులను వెంటనే సంబంధిత శాఖలకు చేరవేసేందుకు 24×7 కంట్రోల్ రూమ్‌ కు తెలిపేందుకు 9441592127 నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News February 7, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం

image

కోవూరులో ఇటీవల అపహరణకు గురైన బాలిక చెన్నైలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అంగడికి వెళ్తున్న బాలికను ఇద్దరు మైనర్లు బైకుపై ఎక్కించుకుని మామిడి తోటలోకి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ద్రవం తాగించడంతో బాలిక కోమాలోకి వెళ్లిపోంది. అక్కడి నుంచి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. బాలికను తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయింది. మైనర్లను జువెలైన్ హోంకు తరలించారు.

News February 6, 2026

నెల్లూరు జిల్లాలో రైతులకు లోన్లు రావడం లేదు..!

image

నెల్లూరు జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ప్రస్తుత ప్రభుత్వంలో మళ్లీ వాటిని చుక్కల భూములుగా చూపారని పలువురు రైతులు వాపోతున్నారు. పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లిన రైతులను అధికారులు 1బి అడంగల్ తీసుకు రావాలని కోరుతున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చుక్కల భూములకు 1బి అడంగల్ ఇవ్వడం లేదు. దీంతో రైతులకు రుణాలు అందక అవస్థలు పడుతున్నారు.

News February 6, 2026

నెల్లూరు జిల్లాలో టీచర్‌ను కాపాడిన స్టూడెంట్

image

ఉదయగిరి మండలం గండిపాలెం జడ్పీ స్కూల్లో తెలుగు టీచర్ కేసీ మాలకొండయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 10వ తరగతి విద్యార్థి కంచర్ల వెంకట కిరణ్ సిద్ధార్థ్ వెంటనే గమనించి టీచర్‌కు CPR చేయడంతో ప్రాణాలు నిలిచాయి. తర్వాత ఆయనను నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. సకాలంలో స్పందించి టీచర్ ప్రాణాలు నిలిపిన విద్యార్థికి పలువురు అభినందనలు తెలిపారు.