News April 2, 2024

నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి బదిలీ

image

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

Similar News

News October 1, 2025

నెల్లూరు: నలుదిక్కులా ట్రాఫిక్ చిక్కులు

image

నెల్లూరు నగరాన్ని వాహనాలు చుట్టు ముట్టాయి. దసర పండుగ నేపథ్యంలో చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున చేరుకోవడం, ప్రజలు పలు అవసరాల నిమిత్తం నగరంలోకి రావడంతో ఆత్మకూరు బస్టాండ్, ఫ్లైఓవర్, స్టోన్ హౌస్ పేట, మినిబైపాస్, రైల్వే స్టేషన్ రోడ్లలో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి. ఎటుచుసిన వాహనాలు కదలక పోవడంతో వాహనదారులు నరకం అనుభవించారు. ఇదేమి నరకం రా బాబూ అంటూ.. జనం విసుగెత్తి పోయారు.

News October 1, 2025

నెల్లూరు జిల్లా 2వ స్థానం

image

జిల్లా లో 2025 – 26 సం.కు గాను ఇన్‌స్పైర్ – మనక్ నామినేషన్లు విశేష స్పందన లభించినట్లు జిల్లా సైన్స్ అధికారి శివారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా మొదటి స్థానంలో నిలువగా నెల్లూరు జిల్లా రెండో స్థానంలో నిలిచినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 711 పాఠశాలలు నుంచి 2925 నామినేషన్లు అందినట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లాలో 3 వేలు నామినేషన్ రాగా, నెల్లూరు జిల్లా 2925 నామినేషన్లు వచ్చాయన్నారు.

News October 1, 2025

శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి సేవలో కలెక్టర్

image

నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదుర్గా అలంకార రూపంలో కొలువైన జగన్మాతను మంగళవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ కోవూరు జనార్ధన్ రెడ్డి ఆలయ మర్యాదలతో కలెక్టర్కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.