News July 6, 2024

నెల్లూరు: ఎస్సీ కార్పొరేషన్ ఈఓ సస్పెండ్

image

ఎస్సీ కార్పొరేషన్ ఈఓ సెల్విని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్లో కొన్ని రకాల ఉద్యోగోన్నతుల నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన గత నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ ఉన్నతాధికారులకు నివేదికను పంపారు. దీంతో ఈఓపై సస్పెన్షన్ వేటు పడింది.

Similar News

News February 12, 2026

50 పడకల హాస్టల్ భవనాల పురోగతి ఏంటి? : వేమిరెడ్డి

image

ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ (DAJGUA) పథకం కింద నెల్లూరు జిల్లాలో 50 పడకల హాస్టల్ భవనాన్ని మంజూరు చేసిందా అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. హాస్టల్‌ నిర్మాణం కోసం మంజూరైన నిధులలో ఎంత ఖర్చు చేశారు?, పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత? వంటి వివరాలు కోరారు. కేంద్రమంత్రి దుర్గా దాస్ ఉయికే నెల్లూరుతో పాటుమొత్తం 31 హాస్టల్స్‌కు రూ.75.3 కోట్లు మంజూరు చేశామన్నారు.

News February 12, 2026

నెల్లూరు: నకిలీ డాక్టర్ అరెస్ట్

image

వైద్యం పేరుతో నమ్మించి మహిళను మత్తులోకి దించి నగలు దోచుకున్న నకిలీ డాక్టర్‌ను అలిపిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన దేవళ్ల సాయి కృష్ణ (29) జయమ్మ అనే మహిళకు వైద్యం చేస్తానని రూ.1.45 లక్షలు వసూలు చేసి, ఆమె బంధువు మౌనికకు మత్తు మాత్రలు ఇచ్చి 30 గ్రాముల బంగారు గొలుసు అపహరించాడు. నిందితుడు గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు అలిపిరి ఎస్ఐ శ్రీవాణి తెలిపారు.

News February 12, 2026

నెల్లూరు: 8 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్

image

నెల్లూరు జిల్లాలో గుర్తించబడిన 8 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. జలదంకి, బోగోలు, మర్రిపాడు, వింజమూరు, కలిగిరి, ఇందుకూరుపేట, ఆత్మకూరు గ్రామీణ, అనంతసాగరం తదితర 8 మండలాలకు గాను ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 23న కలెక్టరేట్‌లో లాటరీ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.