News February 25, 2025
నెల్లూరు ఐటీడీఏ పీవోగా మల్లికార్జున్ రెడ్డి

నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా మల్లికార్జున్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొండాయపాలెం గేటు వద్ద ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కొంతకాలంగా ఆ స్థానం ఖాళీగా ఉండడంతో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి PBN పరిమళ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వహించారు. ఎట్టకేలకు ప్రభుత్వం రెగ్యులర్ POను నియమించడంతో ఆ స్థానం భర్తీ అయ్యింది. ఈ మేరకు మల్లికార్జున్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
Similar News
News February 25, 2025
నెల్లూరు జిల్లాకు రూ.33.52 కోట్ల విడుదల

నెల్లూరు జిల్లాకు 19వ విడత ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రూ.33.52 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1.68 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. ఈ నిధులు రైతుల ఖాతాలకు నేరుగా జమవుతాయని తెలిపారు. రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున నగదు జమవుతుందన్నారు.
News February 25, 2025
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు ఎస్పీ

ప్రముఖ బ్యాంకుల పేర్లతో వచ్చే మోసపూరిత SMSల విషయంలో నెల్లూరు జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకుల పేరుతో SMSలు పంపి వల వేస్తారని చెప్పారు. ప్రజలు వారి వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్ నేరానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News February 25, 2025
నెల్లూరు కలెక్టర్ ఆగ్రహం

నెల్లూరు జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అనధికారికంగా నియామకాలు జరిగాయి. నిన్న కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్ డేలో పలువురు ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనధికారిక నియామకాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని.. తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని అధికారులను హెచ్చరించారు.