News August 10, 2025

నెల్లూరు: ఐదుకు చేరిన మృతుల సంఖ్య

image

నెల్లూరు(D) ఉలవపాడు(M) చాకిచెర్ల సమీపంలో నిన్న జరిగిన <<17348140>>ఘోర ప్రమాదంలో <<>>మృతుల సంఖ్య ఐదుకు చేరింది. పల్నాడు(D) కొత్తగణేశునిపాడుకు చెందిన చిన వెంకటేశ్వర్లు తన పిల్లల పుట్టు వెంట్రుకలు తీయడానికి తుపాన్ వాహనంలో తిరుమలకు బయల్దేరారు. మార్గమధ్యలో వీరి వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన వెంకటేశ్వర్లు భార్య సుభాషిణి, కుమారుడు అభినవ్ కృష్ణ, తల్లి వెంకట నరసమ్మ, మామ శ్రీనివాసరావు, వదిన రుక్మిణి చనిపోయారు.

Similar News

News August 12, 2025

YS జగన్‌కు రాఖీ కట్టిన కాకాణి పూజిత

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం కాకాణి పూజిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు బొకే అందించి రాఖీ కట్టారు. అనంతరం మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు ఆమె జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

News August 12, 2025

సింగరాయకొండలో రైలు కిందపడి వృద్దురాలి మృతి

image

కందుకూరు మండలం విక్కిరాలపేట గ్రామానికి చెందిన ఎక్కటిల్లి లక్షమ్మ(80) మంగళవారం సింగరాయకొండలో రైలు కిందపడి మృతి చెందింది. రైల్వే స్టేషన్‌లో కృష్ణా ఎక్స్ ప్రెస్ కింద పడి మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న ఆధార్ కార్డును బట్టి రైల్వే పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 12, 2025

నెల్లూరు: 6 పోస్టులకు నోటిఫికేషన్

image

నెల్లూరు సిటీ, కందుకూరు బాలసదనంలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు ఐసీడీఎస్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. హెల్పర్ కం నైట్ వాచ్‌మెన్-2, హౌస్ కీపర్-1, ఎడ్యుకేటర్-1, యోగా టీచర్-1, మ్యూజిక్ టీచర్-1 పోస్టులను ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం పద్ధతిన భర్తీ చేస్తామని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.