News March 11, 2025
నెల్లూరు: కలెక్టరేట్‌లో ఉచితంగా భోజనాలు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో కలెక్టరేట్‌లో జరిగే PGRSకు ప్రజలు ప్రతి సోమవారం వస్తూ ఉంటారు. భోజన సమయం అయ్యేసరికి చేతిలో ఉండీ, లేక చాలామంది పస్తులు ఉంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కలెక్టర్ ఆనంద్ అర్జీదారులకు ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. సమస్యలతో వచ్చే ప్రతి ఒక్కరూ కడుపునిండా భోజనం చేసేలా ఏర్పాట్లు చేసిన కలెక్టర్ ఆనంద్‌ను ప్రజలు అభినందిస్తున్నారు.
Similar News
News February 5, 2026
నెల్లూరులో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఖాళీలు ఇవే

నెల్లూరు డివిజన్ పరిధిలోని అల్లీపురం, అనంతసాగరం, ఇందుకూరుపేట, కలిగిరితో పాటు 50 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గూడూరు డివిజన్ పరిధిలోని సర్వేపల్లి, మేనకూరు, విందూరు తదితర గ్రామాల్లో 31 పోస్టులను భర్తీ చేస్తారు. రూ.12వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <
News February 5, 2026
సమన్వయంతో పనిచేయండి: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో GST ఆదాయాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో కమర్షియల్ టాక్స్ శాఖతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో TDS నిబంధనలు పాటించాలన్నారు.
News February 5, 2026
నెల్లూరు రొయ్యలకు గిరాకీ..!

నెల్లూరు జిల్లాలో 40వేల ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. సోమశిల, కండలేరుతో పాటు 276 చెరువుల్లో కలిపి ఏటా 5లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతోంది. 2021-22లో 4.67లక్షలు, 2022-23లో 3.44లక్షలు, 2023-24లో 3.29లక్షలు, 2024-25లో 3.63లక్షలు, 2025-26లో 3.39లక్షల టన్నుల ఉత్పత్తి జరగ్గా.. 60శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. ఈయూ దేశాలతో ఇండియా ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకోవడంతో మన రొయ్యలకు అక్కడ డిమాండ్ పెరగనుంది.


