News April 10, 2025

నెల్లూరు కలెక్టరేట్‌లో పోస్టర్ ఆవిష్కరణ

image

ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ సభ్యులు గురువారం కలెక్టర్ ఆనంద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. వారు రూపొందించిన “ప్రభుత్వ పాఠశాలలలో మీ పిల్లలను చేర్పించండి వారి బంగారు భవితకు బాటలు వేయండి” పోస్టర్‌ను కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్య అందుతుందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జేసీ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 18, 2025

నెల్లూరు: ఒకేసారి రూ.5వేలు పెరిగిన ధర

image

నెల్లూరు జిల్లాలో కొంతమేర నిమ్మ ధరలు పెరిగాయి. పొదలకూరు మార్కెట్‌లో లూజు బస్తా శుక్రవారం రూ.7వేల నుంచి రూ.9వేలు పలికింది. మంచు ప్రభావం తగ్గి వేసవితాపం పెరగడంతో ఢిల్లీలో మార్కెట్ ఊపందుకుంది. 15 రోజుల కిందట రూ.4,500 ఉన్న ధర ఒకేసారి రూ.5 వేలు పెరిగి రూ.9వేలకు చేరింది. దీంతో రైతులు చెట్లకు ఉన్న కాయలు జాగ్రత్తగా కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. చెన్నై, బెంగళూరు, కేరళకు తరలిస్తున్నారు.

News April 18, 2025

నెల్లూరు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి: యువరాజ్

image

అధికారులు సమన్వయంతో పనిచేసి నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ యువరాజ్ అధికారులకు సూచించారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌లో ఆయన కలెక్టర్ ఆనంద్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా మాత్రమే రెవెన్యూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అన్నారు.

News April 18, 2025

నెల్లూరు: ప్రజలకు ఈకేవైసీ కష్టాలు

image

రేషన్ కార్డుదారులకు మరోసారి ఈకేవైసీ కష్టాలు వచ్చాయి. గతంలో ఈకేవైసీని వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. సరిగా వేలిముద్రలు పడని వారివి ప్రస్తుతం పెండింగ్ చూపిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీలోనూ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పిల్లలు, పెద్దలకు ఈకేవైసీ పూర్తిచేయాలని భావించింది. పొదలకూరు మండలంలోనే 6,125 మందికి ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్లు సివిల్ సఫ్లై డీటీ రవికుమార్ తెలిపారు.

error: Content is protected !!