News April 10, 2024
నెల్లూరు కలెక్టర్‌కే ఎంపీ టికెట్

ఒకప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వ్యక్తికే ఇక్కడి ఎంపీ టికెట్ లభించింది. ఆయన ఎవరో కాదు కొప్పుల రాజు. IAS అధికారి అయిన రాజు నెల్లూరు కలెక్టర్‌గా 1988 నుంచి 1992 వరకు పని చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. ఆ పార్టీలో కీలక పదవులు పోషించారు. రాహుల్‌కు దగ్గర మనిషి. గతంలో నెల్లూరులో పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనకే కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ టికెట్ కేటాయించింది.
Similar News
News March 16, 2025
అమరజీవి త్యాగం మరువలేనిది: నెల్లూరు కలెక్టర్

అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం మరువలేనిది, అపారమైనదని నెల్లూరు కలెక్టర్ ఆనంద్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆత్మకూరు బస్టాండ్ వద్దగల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేటి యువతకు ఆయన జీవితం ఆదర్శమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యుడు శ్రీరాములు అని కలెక్టర్ కొనియాడారు.
News March 16, 2025
నేడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకై ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి నేడు. 1901లో మార్చి 16న మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. గాంధీ బోధించిన సత్యం, అహింస మార్గాలను అనుసరిస్తూ హరిజనోద్ధరణ కోసం అహర్నిశలు శ్రమించిన మహా పురుషుడు అమరజీవి శ్రీ పొట్టిరాములు.
News March 16, 2025
ఆ టీడీపీ నేతలను కచ్చితంగా జైలుకు పంపుతాం: కాకాణి

అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్, ఎర్రచందనం కొల్లగొట్టిన వారిని వదిలే ప్రశక్తే లేదని మాజీ మంత్రి కాకాణి హెచ్చరించారు. 2014లో CM చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్న ఆయన.. బాధ్యులపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 15 ఏళ్లలో అగ్రిగోల్డ్ భూముల్లో దాదాపు రూ.3.5కోట్ల వృక్ష సంపదను టీడీపీ నేతల కొల్లగొట్టారని, వారిని జైలుకు పంపుతామని కాకాణి వార్నింగ్ ఇచ్చారు.