News April 1, 2025
నెల్లూరు: కాకాణి విచారణకు వస్తారా?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాకాణికి నోటీసులు అందచేసేందుకు పొదలకూరు పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకి నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఆయన విచారణకు వస్తారా లేదా అని జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News April 2, 2025
రాష్ట్రంలోనే నెల్లూరుకు రెండో స్థానం

రాష్ట్రంలో అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న నగరాలలో రెండో స్థానంలో నెల్లూరు నిలిచినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. కడప నగరం మొదటి స్థానంలో ఉంది. కర్నూలు, ఒంగోలు మూడో స్థానంలో నిలిచాయని వెల్లడించింది.
News April 2, 2025
అనంతసాగరం: ఈతకెళ్లి యువకుడి మృతి.. జరిగిందిదే..!

అనంతసాగరం, మినగల్లుకు చెందిన మస్తాన్ బాష ఈతకెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం స్నేహితులతో ఉత్తర కాలువలోకి వెళ్లాడు. ప్రవాహం అధికంగా ఉండడంతో..కొట్టుకుపోయాడు. సమాచారమందుకున్న పేరెంట్స్ గాలించినా దొరకకపోవడంతో..పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం ఉదయం గాలించగా..నన్లరాజుపాలెం సమీపంలో డెడ్ బాడీ లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు.
News April 2, 2025
నెల్లూరు: గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని నెల్లూరు అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025 -26 సంవత్సరానికి గాను 5, 6, 7 ,8వ తరగతులలో ప్రవేశం పొందేందుకు అర్హులు ఆన్‌లైన్లో https://aprs.apcfss.in దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ. మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకొవాలన్నారు.