News June 24, 2024
నెల్లూరు: కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా ప్రమాదం.. తల్లి స్పాట్ డెడ్

కుమార్తెను చూసేందుకు వస్తున్న తల్లి రోడ్డుప్రమాదంలో మృతి చెందింది. విడవలూరు(M), ముదివర్తి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, సరోజనమ్మ దంపతుల కుమార్తె హారిక నెల్లూరులోని రామ్మూర్తి నగర్‌లో ఉంటున్నారు. కుమార్తెను చూసేందుకు వారు బైక్‌పై వస్తుండగా NTR నగర్ వద్ద లారీ ఢీకొట్టడంతో సరోజమ్మ అక్కడికక్కడే మృతి చెందగా..లక్ష్మీనారాయణకు గాయాలయ్యాయి. భార్య విగతజీవిగా పడిఉండడం చూసి భర్త గుండెలవిసేలా రోదించారు.
Similar News
News February 18, 2026
నెల్లూరు: ఇలా చేస్తే రూ.5వేలు!

నెల్లూరు జిల్లాలో మై భారత్ యువ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి ఆకుల మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన 10 ఉత్తీర్ణులై 2025 ఏప్రిల్ ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండి 29 ఏళ్లు లోపు వారు అర్హులన్నారు. రూ. 5వేలు గౌరవ వేతనం ఉంటుందన్నారు. ఈనెల 20వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
News February 18, 2026
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఒంగోలు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. నూతన రిజిస్ట్రార్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
News February 18, 2026
నెల్లూరు జిల్లా లాడ్జీల్లో తనిఖీలు

ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మంగళవారం రాత్రి లాడ్జీలు, హోటల్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. లాడ్జీల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు. రాత్రి వేళల్లో లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నించారు. వారి వివరాలను ఆరా తీశారు.


