News June 9, 2024

నెల్లూరు: కూటమికి 63.72 శాతం పోస్టల్ బ్యాలెట్

image

తాజా ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూటమికి 15,431(63.72) మంది ఉద్యోగులు ఓట్లు వేసినట్లు అధికారులు వెల్లడించారు. మెత్తం 24,216 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. వారిలో కేవలం 5,925(24.47) మంది మాత్రమే వైసీపీకి ఓటు వేశారు. మరోవైపు ఇండియా కూటమికి 1,580(6.52) మంది ఓటు వేశారు. కాగా జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News September 30, 2024

నెల్లూరు: RTC బస్సు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

image

సంగం- కొరిమెర్ల మార్గమధ్యంలో రోడ్డు మలుపు వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెంకు చెందిన నరసింహరావు(24) ఏఎస్ పేటలో జరిగే గంధమహోత్సవానికి బైక్‌పై వెళ్తుండగా సంగం- కలిగిరి రహదారిలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్‌టీసీ బస్ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 29, 2024

గూడూరులో దారుణం.. విద్యార్థిపైకి దూసుకెళ్లిన కారు

image

గూడూరు పట్టణ పరిధిలోని SKR ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వంశీ అనే యువకుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి విద్యార్థిపైకి కారు దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన లీలా విక్షత్ (11) అనే విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నట్లు సమాచారం. వంశీని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

News September 29, 2024

కలువాయి మండలంలో మరో సైబర్ క్రైం

image

కలువాయిలో ఆశా వర్కర్ ఖాతా నుంచి నగదు కొట్టేసిన ఘటన తెలిసిందే. అదే మండలంలోని ఉయ్యాలపల్లి సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న యస్. వెంకటరమణమ్మ ఖాతా నుంచి రూ.33,350 సైబర్ నేరగాళ్లు కొట్టేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీ మొబైల్‌లో ఈ-సిమ్ యాక్టివేట్ అయ్యింది ప్రొఫైల్ ‘ON’ చేయమని మెసేజ్ వచ్చింది. దీనితో ఆమె ‘ON’ నొక్కగానే ఖాతా నుంచి నగదు డెబిట్ అయ్యిందని ఆమె తెలిపారు.