News December 13, 2025
నెల్లూరు: కూతురుపై కాటు వేసిన కామాంధు తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష

కన్న కూతురుపై కన్నేసిన ఓ తండ్రి కామంతో కాటు వేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నిందితుడు చల్లా దశరథకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.25 వేలు జరిమానా విధించినట్లు వింజమూరు ఎస్సై కే వీరప్రతాప్ తెలిపారు. 2020 లో వింజమూరు బీసీ కాలనీకి చెందిన దశరథ తన కూతురును బైక్‌పై ఎక్కించుకొని నేరేడుపల్లి గ్రావెల్ రోడ్డు సమీపంలో ఉన్న నిమ్మ తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
Similar News
News December 14, 2025
నెల్లూరు కలెక్టర్‌కు రాజీనామా లేఖ పంపిన మేయర్

నెల్లూరు మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఆదివారం మధ్యాహ్నం వాట్సాప్ ద్వారా పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. రాజీనామా లేఖ ఆమోదించిన తర్వాతనే క్యాంపులో ఉండే కార్పొరేటర్లు నెల్లూరుకు వస్తారని సమాచారం.
News December 14, 2025
నెల్లూరులో ఎత్తులకు పైఎత్తులు.. మేయర్ ట్విస్ట్!

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం కిడ్నాప్, బెదిరింపులకు దారి తీసింది. TDP, YCP నాయకులు పోలీస్ స్టేషన్‌కు సైతం వెళ్లారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలనే ఉద్దేశంతో TDP నేతలు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. కొందరికి డబ్బులు ఆఫర్ చేసినట్లు సమాచారం. మేయర్ పీఠం కోసం ఇలా రెండు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటే రాజీనామాతో స్రవంతి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మానం ఉండదని తెలుస్తోంది.
News December 14, 2025
15న నెల్లూరుకు ఢిల్లీ CM రాక

నెల్లూరు హరినాథపురంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ జరగనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 15న జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆరోజు అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర జరగనున్నట్లు చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరవుతారని తెలిపారు.


