News December 13, 2025
నెల్లూరు: కూతురుపై కాటు వేసిన కామాంధు తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష

కన్న కూతురుపై కన్నేసిన ఓ తండ్రి కామంతో కాటు వేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నిందితుడు చల్లా దశరథకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.25 వేలు జరిమానా విధించినట్లు వింజమూరు ఎస్సై కే వీరప్రతాప్ తెలిపారు. 2020 లో వింజమూరు బీసీ కాలనీకి చెందిన దశరథ తన కూతురును బైక్‌పై ఎక్కించుకొని నేరేడుపల్లి గ్రావెల్ రోడ్డు సమీపంలో ఉన్న నిమ్మ తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
Similar News
News December 15, 2025
బిట్రగుంట: రైలు ఢీకొని తెగిపడిన యువకుడి తల

బిట్రగుంట రైల్వే స్టేషన్ దగ్గర గుర్తు తెలియని యువకుడిని రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. 20 – 25 ఏళ్ల వయస్సుగల యవకుడు రైలు వచ్చేసమయంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈఘటనలో యువకుడి తల తెగిపడింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. వివరాలు తెలిసినవారు కావలి రైల్వే పోలీసులను సంప్రదించగలరు.
News December 15, 2025
నెల్లూరు మేయర్ రాజీనామా ఆమోదం

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొకుండానే సొంత నిర్ణయం తీసుకున్నారు. మేయర్ తన ప్రతినిధి ద్వారా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాజీనామా లేఖను అందించారు. ఆ రాజీనామాకు ఆమోద ముద్ర పడింది. 18న కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరపనున్నారు.
News December 15, 2025
నేడు వైసీపీ ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ ర్యాలీ

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని సంబంధించిన పత్రాలను జిల్లా నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపే కార్యక్రమం నెల్లూరులో సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో బైకులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.


