News December 13, 2025
నెల్లూరు: కూతురుపై కాటు వేసిన కామాంధు తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష

కన్న కూతురుపై కన్నేసిన ఓ తండ్రి కామంతో కాటు వేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నిందితుడు చల్లా దశరథకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.25 వేలు జరిమానా విధించినట్లు వింజమూరు ఎస్సై కే వీరప్రతాప్ తెలిపారు. 2020 లో వింజమూరు బీసీ కాలనీకి చెందిన దశరథ తన కూతురును బైక్‌పై ఎక్కించుకొని నేరేడుపల్లి గ్రావెల్ రోడ్డు సమీపంలో ఉన్న నిమ్మ తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
Similar News
News December 15, 2025
నోట్లో యాసిడ్ పోస్తానని బెదిరించారు: నెల్లూరు మాజీ మేయర్

నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డిపై మాజీ మేయర్ స్రవంతి సంచలన ఆరోపణలు చేశారు. ‘నెల్లూరులో పోలీసులను సైతం బెదిరిస్తున్నారు. నన్ను పదవి నుంచి తొలగించ వద్దని కొందరు ఆందోళన చేశారు. దీంతో 33వ డివిజన్ కార్పొరేటర్ చేత కోటంరెడ్డి ఫోన్ చేయించారు. నాకు మద్దతుగా నిలిచిన 70 ఏళ్ల వృద్ధుడి నోట్లో యాసిడ్ పోస్తామని, నరుకుతామని బెదిరించారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఆమె స్పందించలేదు’ అని స్రవంతి చెప్పారు.
News December 15, 2025
నెల్లూరు ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్

నెల్లూరు నగర మేయర్‌గా స్రవంతి చేసిన రాజీనామాకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. కొత్త మేయర్‌ను ఎన్నుకునే దాకా.. కార్పొరేషన్‌లో పరిపాలన వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా డిప్యూటీ మేయర్లలో ఒకరిని మేయర్‌గా ప్రకటించాలని కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో కొత్త మేయర్ ఎన్నిక జరిగే వరకు రూప్ కుమార్ యాదవ్ ఇన్‌ఛార్జ్ మేయర్‌గా కొనసాగుతారని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
News December 15, 2025
బిట్రగుంట: రైలు ఢీకొని తెగిపడిన యువకుడి తల

బిట్రగుంట రైల్వే స్టేషన్ దగ్గర గుర్తు తెలియని యువకుడిని రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. 20 – 25 ఏళ్ల వయస్సుగల యవకుడు రైలు వచ్చేసమయంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈఘటనలో యువకుడి తల తెగిపడింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. వివరాలు తెలిసినవారు కావలి రైల్వే పోలీసులను సంప్రదించగలరు.


