News February 6, 2025
నెల్లూరు: కోనేరులో యువకుడి గల్లంతు
ఇందుకూరు పేట మండలంలోని గంగపట్నం చాముండేశ్వరీదేవి అమ్మవారి ఆలయ ఆవరణలో ఉన్న కోనేరులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. నరుకూరుకు చెందిన కృష్ణతేజ(20), తన భార్య శ్రావణి, ఇంటి పక్కన ఉన్న ముత్యాలు, మునెమ్మ అనే దంపతులతో కలిసి అమ్మవారి దర్శనం కోసం బుధవారం వెళ్లారు. ఈ క్రమంలో కృష్ణతేజ కోనేరులో దిగి గల్లంతయ్యాడు. సమచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
Similar News
News February 6, 2025
నెల్లూరు: 38ఏళ్ల తర్వాత జాతర.. ఒకరు మృతి
38 ఏళ్ల కిందట ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు(మం), జీలపాటూరులో గ్రామదేవత పోలేరమ్మకు జాతర నిర్వహించారు. ఆ రోజు ఆ గ్రామానికి చెందిన వ్యక్తి గొంజి మొక్కలు తీసుకుని స్వర్ణముఖినది దాటుతూ మృతి చెందాడు. అప్పటి నుంచి అమ్మవారి జాతర చేయలేదు. మళ్లీ 38ఏళ్ల తర్వాత ఈనెల 5న జాతర చేపట్టారు. అమ్మవారి ఘటం మోస్తున్న APSP హెడ్ కానిస్టేబుల్ నరసయ్య ఇంటి దగ్గరకు రాగా..బాత్‌రూంలో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.
News February 6, 2025
నెల్లూరు: వివిధ పోస్టులు భర్తీకి చర్యలు
ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి రమేశ్ నాథ్ తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులలో జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్ కం బయో స్టాటిస్టిక్స్ పోస్టుల భర్తీకి ఈనెల 20వ తేదీ లోగా ఆన్‌లైన్ ద్వారా https :/spsrnellore.ap.gov.in/notice _/requirement దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News February 6, 2025
ఉదయగిరి: సీనియర్ అధ్యాపకుడు గుండెపోటుతో మృతి
ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో పలు కళాశాలల్లో పనిచేసిన సీనియర్ అధ్యాపకుడు బి శ్రావణ్ కుమార్ ప్రస్తుతం ఓ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. గత రాత్రి దాసరిపల్లిలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి భోజనం తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో ఉదయగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.