News June 22, 2024
నెల్లూరు: గునపాటిపాలెంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిట్టమూరు మండలం గుణపాటిపాలెం గ్రామం నందు గల స్వర్ణముఖి నది పంట కాలవలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గుర్తించి సచివాలయం సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు చిట్టమూరు పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందజేశారు. ఆ మృతదేహాన్ని బయటకి తీసి నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 3, 2025
నెల్లూరులో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి పాఠశాలలో ఏడు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. SGT-2, SA గణితం-2, హిందీ-1, బయాలజికల్ సైన్స్-1, ఫిజికల్ సైన్స్-1 మొత్తం 7 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ పోస్టులను డైరెక్ట్ నియామకం ద్వారా భర్తీ చేస్తున్నామని అన్నారు.
News January 2, 2025
నెల్లూరుకు భారీగా యూరియా రాక
తొలికారు వరిసాగు నేపథ్యంలో నెల్లూరులో యూరియాకు భారీగా డిమాండ్ ఏర్పడింది. యూరియా కొరత విషయాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల క్రితం రైతు సంఘం నాయకుడు రాధాకృష్ణయ్య నాయుడు అగ్రికల్చర్ జేడీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో గురువారం ఒక వ్యాగన్(2700 టన్నులు)లో యూరియా రాగా, మరో రెండు వ్యాగన్లు మార్గమధ్యలో ఉన్నాయి.
News January 2, 2025
కావలి: ఆశ్రయం కల్పిస్తే.. చంపేశాడు
కావలిలో ఓ మహిళ <<15037512>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. పోలీసుల కథనం.. కోల్‌కతాకు చెందిన అర్పిత బిస్వాస్(24) కుటుంబం కావలిలో ఓ చికిత్స కేంద్రం నిర్వహిస్తోంది. వారి బంధువు నయాన్ అనే యువకుడిని హెల్పర్‌గా పెట్టుకుని ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు. అయితే నయాన్ యజమానిపై కన్నేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా అర్పితను ఒప్పించి ఇద్దరూ మద్యం తాగారు. మత్తులోకి జారుకోగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.