News December 29, 2025
నెల్లూరు: గ్రీటింగ్ కార్డులు మాయం..!

స్మార్ట్‌ఫోన్ల యుగంలో భావాలను వ్యక్తపరిచే పద్ధతులే మారిపోయాయి. ఒకప్పుడు పండగలు, పర్వదినాలు వచ్చాయంటే చేతిలో గ్రీటింగ్ కార్డు తప్పనిసరిగా ఉండేది. కాలక్రమంలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు శుభాకాంక్షల మార్పిడిని పూర్తిగా డిజిటల్‌గా మార్చేశాయి. ఒక్క క్లిక్‌తోనే సందేశం చేరుతుండటంతో గ్రీటింగ్ కార్డుల అవసరం తగ్గింది.
Similar News
News January 2, 2026
నెల్లూరు: తొలి రోజు.. ‘ఎమ్మెల్యేలు’ ఎక్కడ..?

జిల్లాలో రీ సర్వేలో భాగంగా కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి తొలిరోజు MLAలు పలుచోట్లా డుమ్మా కొట్టారు. అధికారికంగా నేతలు ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా.. కొన్ని చోట్ల అధికారులే కానిచ్చేసారు. కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లో MLAలు పాల్గొనలేదు. విడవలూరు(M) పార్లపల్లిలో ఇవాళ జరగాల్సి ఉన్నా రామతీర్ధంలో MLA ప్రశాంతి రెడ్డి పంపిణీ చేశారు. TP గూడూరు(M) ముంగలదొరువులో రేపు జరగాల్సిన పట్టాల పంపిణీ ఇవాళ జరిగింది.
News January 2, 2026
నెల్లూరు: చిన్నారి డెడ్ బాడీ కలకలం

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక జగనన్న కాలనీలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి మృతదేహం చూసిన కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 2, 2026
నెల్లూరోళ్లు రూ. 143.75 కోట్ల మద్యం తాగేశారు..

నెల్లూరు జిల్లాలో గతేడాది మద్యం ఏరులై పారింది. 2024 డిసెంబర్ నాటికి రూ.139.5 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే.. 2025 ఆ లెక్కను దాటేసింది. నెల్లూరోళ్లు గడిచిన డిసెంబర్ నాటికి రూ. 143.75 కోట్ల మద్యాన్ని తాగేశారు. 2024 తో పోలిస్తే.. రూ. 4 కోట్ల మేరా అధికంగా అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి చూస్తేనే.. జిల్లాలో మద్యం విక్రయాలు ఎంత జోరుగా సాగుతున్నాయో తెలుస్తోంది.


