News July 18, 2024
నెల్లూరు: చెత్త కుప్పలలో నలిగి పోతున్న బాల్యం

నెల్లూరు జిల్లా సీతారామపురంలో కనపడిన ఈ ఘటన చూపారుల హృదయాన్ని చలింపజేసింది. తల్లిదండ్రుల ఒడిలో కూర్చొని కమ్మని లాలి పాటలు వింటూ, బడిలో గురువుల వద్ద పలకపై ఓనమాలు దిద్దాల్సిన చేతులు, నేడు మురికి గుంటలో చిన్నారి చెత్త వేరుకుంటూ కనిపించింది. దారినపోయే బాటసారులకు సైతం ఈ ఘటన చూసి కన్నీళ్లు తెప్పించక మానదు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News February 18, 2026
ఈక్రాప్ నమోదును వేగంగా పూర్తి చేయాలి: నెల్లూరు కలెక్టర్

ఈ క్రాప్ నమోదును వేగంగా పూర్తిచేయాలని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకూరుపేట మండలం కొరుటూరు పంచాయతీలో ఆన్‌లైన్‌లో నమోదు చేసిన పంట వివరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ-పంట యాప్ నుంచి రైతుల వివరాలను డౌన్లోడ్ చేసుకొని నమోదు చేసేటప్పుడు ఆధార్ ఫోన్ నెంబర్ సరిచూడాలన్నారు. రైతు గండవరపు అమర్నాథ్ రెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకురాలు ఝాన్సీ పాల్గొన్నారు.
News February 18, 2026
నెల్లూరులో కనిపించిన నెలవంక.. టైమింగ్స్ ఇవే

నెల్లూరు జిల్లాలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం మొదలైంది. చిన్నాపెద్ద తేడా లేకుండా కఠోర ఉపవాస దీక్షలకు ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసంలో ఉంటారు. తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గురువారం సమయాలు ఇలా ఉన్నాయి.
సహరి: ఉదయం 5.12గంటలకు
ఇప్తార్: సాయంత్రం 6:16 గంటలకు
News February 18, 2026
నుడాలో రూ.32.50 కోట్ల పనులకు ప్రతిపాదనలు

నుడా పరిధిలో రూ.32.50 కోట్ల పనులకు ప్రతిపాదనలు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. వాటిల్లో రూ.28.60 కోట్ల పనులు మంజూరైనట్లు వివరించారు. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన అధికారులతో సమీక్ష జరిగింది. జేసీ మాట్లాడారు. రాష్ట్రంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు అందరూ సహకరించాలన్నారు.


