News December 20, 2024
నెల్లూరు: చెల్లికి గర్భం చేసిన అన్న

పొక్సో కేసులో నిందితుడికి శిక్ష ఖరారు చేస్తూ జడ్జి సిరిపిరెడ్డి సుమ గురువారం తీర్పు వెల్లడించారు. అల్లూరు ప్రాంతానికి చెందిన చెంబేటి మురళి తన చిన్నమ్మ కూతురిపై మద్యంమత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు గర్భం రావడంతో పొక్సో కేసు నమోదైంది. జడ్జి విచారణ చేపట్టి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు, రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితులకు శిక్ష పడినందుకు పోలీసులను ఎస్పీ అభినందించారు.
Similar News
News February 26, 2026
NLR: గురుకులాల ప్రవేశ పరీక్ష వాయిదా

గురుకులాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మార్చి 2న ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అదే నెల 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఆ సంస్థ నెల్లూరు జిల్లా సమన్వయకర్త ప్రభావతమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ 2 పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

YCPలోనే ఆదాల.. పార్టీ మార్పు లేనట్లే!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. వైసీపీని వీడి బీజేపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇవాళ నెల్లూరుకు వచ్చిన జగన్‌ను ఆదాల కలిశారు. దీంతో మాజీ MP పార్టీ మార్పు ఊహాగానాలకు చెక్ పడింది.