News February 20, 2025
నెల్లూరు చేరుకున్న రెవెన్యూ శాఖ కార్యదర్శి

రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాం ప్రసాద్ సిసోడియా గురువారం సాయంత్రం నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, కావలి, ఆత్మకూరు RDOలు స్వాగతం పలికారు. రేపు రెవెన్యూ అధికారులతో సిసోడియా సమావేశ మవుతారని జిల్లా సమాచార శాఖ అధికారి సదారావు ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News December 18, 2025
‘ఛాంపియన్ ఫార్మర్’పై నెల్లూరు కలెక్టర్కు ప్రశంసలు

నెల్లూరు జిల్లా వ్యవసాయ రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో వినూత్నంగా ‘ఛాంపియన్ ఫార్మర్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. ఈ కార్యక్రమం వివరాలను ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడంతో సీఎం చంద్రబాబు అభినందించారు. నీటి నిల్వల పరిస్థితి, పంటల మార్పు , రైతుల ఆదాయం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
News December 18, 2025
నెల్లూరు: ఎక్కువ రేటుకు యూరియా ఇస్తున్నారా?

నెల్లూరు జిల్లాలో హోల్ సేల్, రిటైల్ డీలర్లు అధిక ధరలకు యూరియా విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని అగ్రికల్చర్ జేడీ సత్యవాణి హెచ్చరించారు. బ్లాక్లో <<18592684>>యూరియా అమ్మకాలపై <<>>Way2Newsలో వార్త రావడంతో ఆమె స్పందించారు. అధిక ధరలకు ఎవరైనా విక్రయిస్తే 83310 57285కు కాల్ చేయాలని రైతులకు సూచించారు. ఈనెలాఖరున మరో 6వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వస్తుందన్నారు.
News December 18, 2025
నెల్లూరు: 20న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్

పల్లెపాడు డైట్ కాలేజీలో ఈనెల 20న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు నెల్లూరు డీఈవో ఆర్.బాలాజీ రావు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 38 మండలాల నుంచి గ్రూప్ కేటగిరి, విద్యార్థి కేటగిరి, ఉపాధ్యాయ కేటగిరి ప్రాజెక్టులకు సంబంధించి 114 ప్రదర్శనలు జరుగుతాయన్నారు. ఇక్కడ గెలుపొందిన వారు ఈనెల 23, 24వ తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.


