News May 11, 2024

నెల్లూరు: జబర్దస్త్ నటి కారుకి ప్రమాదం

image

నెల్లూరు జిల్లా ఉప్పలపాడు సమీపంలో శనివారం సాయంత్రం జబర్దస్త్ నటి పవిత్ర కారుకి ప్రమాదం జరిగింది. ఓటు వేసేందుకు తమ సొంత ఊరు సోమశిల వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన పవిత్రను దగ్గరలోని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News April 5, 2026

HYDలో నెల్లూరు జిల్లా యువకుడి మృతి

image

హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో నెల్లూరు జిల్లా యువకుడు చనిపోయాడు. కావలికి చెందిన పసుపులేటి పెంచాల దేశిత్(25) HYDలోని హఫీజ్‌పేట్ వద్ద ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఫ్రెండ్‌తో కలిసి బైకుపై శనివారం అల్విన్ కాలనీ వైపు బయల్దేరాడు. బైకును వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దేశిత్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. అతని ఫ్రెండ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

News April 4, 2026

ఉదయగిరి: అస్వస్థతకు గురైన విద్యార్థినిలు

image

ఉదయగిరి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో ముగ్గురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో సిబ్బంది వారిని కళాశాల అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెస్‌లో ఫుడ్ పాయిజన్ కావడం వల్లే విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో శనివారం ఉన్నతాధికారులు కళాశాలలో విచారణ చేపట్టారు.

News April 4, 2026

మహిళల రక్షణకు ‘శక్తి’ ఆయుధం: SP అజిత

image

మహిళల రక్షణే ధ్యేయంగా నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ‘శక్తి’ యాప్‌పై శనివారం విస్తృత అవగాహన కల్పించింది. SP అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో పోలీసులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఆపద సమయంలో ఈ యాప్ మహిళలకు ఎలా రక్షణ కవచంలా నిలుస్తుందో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్‌ను ప్రతి మహిళా తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు.