News December 16, 2025
నెల్లూరు జిల్లాకు TDP కొత్త బాస్ ఈయనే.!

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర యాదవ్ పేరు ఖరారైంది. కాగా అధికారిక ప్రకటన విడుదల కావల్సి ఉంది. ప్రస్తుతం రవిచంద్ర టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాయలసీమ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. గతంలోనూ ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.
Similar News
News December 17, 2025
భారత ఉపరాష్ట్రపతిని కలిసిన MP వేమిరెడ్డి

నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి కార్యాలయానికి బుధవారం MP వెళ్లారు. ఇందులో భాగంగా వేమిరెడ్డి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు అంశాలపై చర్చించారు.
News December 17, 2025
నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయండి: MP

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయాలని భారత రైల్వే బోర్డు ఛైర్మన్ సంతోశ్ కుమార్‌ను ఢిల్లీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఆయన్ను MP మర్యాదపూర్వకంగా కలిశారు. బిట్రగుంట అభివృధ్ధి, ROB, RUBల పూర్తి, వివిధ ప్రాంతాల్లో ప్రధాన ట్రైన్లకు హాల్టింగ్ ఏర్పాటుపై చర్చించారు. జిల్లాలో రైల్వే పరిధిలో పెండింగ్లో ఉన్న అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.
News December 17, 2025
నెల్లూరు: డ్రోన్స్ తిరుగుతున్నాయ్ తస్మాత్ జాగ్రత్త!

నెల్లూరు నగరం, చుట్టు పక్కల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రోన్స్ తిరుగుతున్నాయి. వాటి పని ఏమిటంటే మారుమూల ప్రాంతాల్లో, పాడుబడిన భవనాల్లో ఎక్కడెక్కడ ఆకతాయిలు తిరుగుతారో వారిని టార్గెట్ చేస్తాయి ఈ డ్రోన్లు. వారు ఏమి చేస్తున్నారు. ఎక్కడ ఉన్నారో పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది. వారు పేకాట ఆడుతున్నారా.. మద్యం తాగుతున్నారా.. మరేమైనా చీకటి పనులు చేస్తున్నారా అనేది తెలిసిపోయి పోలీసులు దాడులు చేస్తారు.


