News August 13, 2024

నెల్లూరు జిల్లాలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేది ఇక్కడే

image

ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో అన్న క్యాంటీన్లను ఈ పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నారు.
*నెల్లూరు : AC మార్కెట్, Fish మార్కెట్, PWD ఆఫీస్, ఇందిరా భవన్,
ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్, జవహార్ బాల భవన్, సెరికల్చర్ ఆఫీస్,
*కందుకూరు : Fish మార్కెట్,
*కావలి : MRO OFFICE PREMISES

Similar News

News May 8, 2025

హై కోర్టులో కాకాణి బెయిల్ పిటిషన్.. తీర్పు వాయిదా

image

మాజీ మంత్రి కాకాణికి హైకోర్టులో ఊరట దక్కలేదు. పొదలకూరు(మ) వరదాపురంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. గిరిజనులను బెదిరించారనే ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కాకాణి వేసిన పిటీషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు.. తీర్పును జూన్ 16కు వాయిదా వేసింది. కాకాణి పరారీలో ఉన్న విషయం తెలిసిందే.

News May 8, 2025

నుడా వీసీగా జేసీ కార్తీక్

image

నెల్లూరు అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్(నుడా) వైస్ ఛైర్మన్‌గా జాయింట్ క‌లెక్టర్ కార్తీక్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నుడా వీసీగా నెల్లూరు కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ సూర్యతేజ‌ పనిచేశారు. ఆయన ఇటీవలే బ‌దిలీ అయ్యారు. గ‌త కొద్ది రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో జేసీని నుడా వైస్ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.

News May 7, 2025

మత్స్యకార సేవలో పథకం ద్వారా జిల్లాకి రూ.24.47 కోట్లు

image

జిల్లాలో మత్స్యకార సేవలో పథకం ద్వారా 12,239 మంది మత్స్యకారులకు రూ.24.47 కోట్లు నగదును వారి బ్యాంకు ఖాతాలకు ముఖ్యమంత్రి జమచేసినట్లు జిల్లా మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం బీచ్‌ నుంచి సీఎం చంద్రబాబు ‘మత్స్యకార సేవలో’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.