News May 19, 2024
నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఇదే చర్చ

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈక్రమంలో జిల్లాలో ఎక్కడ చూసినా ఎవరు గెలుస్తారనే దానిపైనే చర్చలు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు స్థానికులకు ఫోన్ చేసి మీ దగ్గర ఎవరు గెలుస్తారని ఆరా తీస్తున్నారు. మరోవైపు నెల్లూరు సిటీలో మెజార్టీపై, కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలుపుపై జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News February 27, 2026
చెవులు మూసుకుని నెల్లూరు MLC నిరసన

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై చర్చించాలని శాసనమండలిలో వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వారంతా మండలిలో కింద కూర్చొని ఆందోళన చేశారు. నెల్లూరుకు చెందిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెవులు మూసుకుని, ఇతర MLCలు కళ్లు, నోరు మూసుకుని తమ నిరసన తెలిపారు.
News February 27, 2026
నెల్లూరు DPO కీలక ఆదేశాలు

నెల్లూరు జిల్లాలోని పంచాయతీల్లో 100% ఇంటి పన్నులను సెక్రటరీలు వసూలు చేయాలని DPO వసుమతి ఆదేశించారు. జిల్లాలో మార్చి నెలాఖరు నాటికి పన్నులు వసూలు చేయాలని చెప్పారు. పాదలకూరు, కోవూరు, వింజమూరు, రాపూరు పంచాయతీల్లో పన్నులు భారీగా పేరుకుపోయాయని తెలిపారు. వీటిని రాబట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు.
News February 27, 2026
నెల్లూరు: కిడ్నాప్.. తల లేకుండా డెడ్‌బాడీ లభ్యం

ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో యువకుడి మృతి కలకలం రేపింది. ముస్లిం వీధికి చెందిన ఉస్మాన్ ఓ హిజ్రాతో సన్నిహితంగా ఉండేవాడు. ఆమెకు చెందిన కొంత బంగారాన్ని అతని అన్న హుస్సేన్(33) తాకట్టు పెట్టి నగదు వాడుకున్నాడు. దీంతో ఆ హిజ్రా మరికొందరితో వచ్చి హుస్సేన్‌ను ఆటోలో తీసుకెళ్లి కిడ్నాప్ చేసింది. ఏమైందో ఏమో గురువారం పండ్లూరు వద్ద రైల్వే పట్టాలపై తల లేని మొండెంగా హుస్సేన్ డెడ్‌బాడీ దొరికింది.


