News November 9, 2024
నెల్లూరు జిల్లాలో ఉచితంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు
నెల్లూరు జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు APSPDCL జిల్లా సర్కిల్ SE విజయ్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లకు వినియోగదారులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదన్నారు. ఇప్పటికే 8 వేల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశామన్నారు. కచ్చితమైన విద్యుత్ రీడింగ్ కోసం ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News December 27, 2024
నెల్లూరు VR లా కాలేజీలో రెండు వర్గాలు పరస్పర దాడులు
నెల్లూరులోని VR లా కాలేజీలో రెండు వర్గాలు పరస్పర భౌతిక దాడులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. దీంతో నెల్లూరు లా కాలేజీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ విద్యార్థినిపై వేధింపులే ఈ ఘర్షణకు కారణం అని తెలుస్తోంది. లా విద్యార్థులపై చెన్నై నుంచి వచ్చిన రౌడీలు దాడికి పాల్పడడం గమనార్హం. ఈ ఘటనపై నెల్లూరు ఒకటో నగర పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు.
News December 27, 2024
నెల్లూరు: మరి కాసేపట్లో జిల్లా వ్యాప్తంగా వైసీపీ పోరుబాట
కూటమి ప్రభుత్వం కరెంట్ చార్జీల బాదుడుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోరుబాట కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. సామాన్యులపై వేలకోట్లు భారం మోపిన కూటమి సర్కార్‌పై నిరసన స్వరం వినిపించేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని కోరారు.
News December 27, 2024
నెల్లూరు: జీజీహెచ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా మహేశ్వర్ బాధ్యతలు
నెల్లూరు జిల్లా సర్వజన ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారిగా గురువారం మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఏవోకు ఆసుపత్రి పర్యవేక్షకులు సిద్ధనాయక్, అభివృద్ధి కమిటీ సభ్యులు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచి సౌకర్యాల కల్పనలో ముందు ఉంటామన్నారు.