News January 4, 2026

నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు ప్రిన్సిపల్స్, పీజీటీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. ఈనెల 6వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, రెండు సెట్స్ జిరాక్స్ అందజేయాలన్నారు. ఇంటర్వ్యూలు, డెమాన్ స్ట్రేషన్ తరగతులు ఈనెల 7న ఉదయం 10 గంటలకు దర్గామిట్ట ZP బాలికల హైస్కూలులో నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News January 23, 2026

నెల్లూరు: SP- సంపర్క్ కార్యక్రమానికి శ్రీకారం

image

‘డయల్ యువర్ SP.’ (SP- సంపర్క్) అనే పోలీస్ సిబ్బంది గ్రేవియన్స్ కార్యక్రమానికి ఎస్పీ డా. అజిత వేజెండ్ల శ్రీకారం చుట్టారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశ్యంతో ‘డయల్ యువర్ SP.’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.00 నుంచి 5.00 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.

News January 23, 2026

ఉదయగిరి: ‘సాయంత్రం 6 గంటల తర్వాత అటువైపు వెళ్లొద్దు’

image

ఉదయగిరి – బండగానిపల్లి ఘాట్ రోడ్డు వైపు సాయంత్రం 6 గంటల తర్వాత అటువైపు వెళ్లొద్దని ఉదయగిరి రేంజ్ అధికారి BS కుమార్ రాజా తెలిపారు. శుక్రవారం కొండ కింద గ్రామాలలో అటవీ, పోలీస్, రెవెన్యూ, ఎంపీడీవో అధికారులు సందర్శించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసరం అయితే మాత్రమే గుంపుగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయాలని, మూగజీవాలను అడవిలోకి తీసుకు వెళ్లొద్దని సూచించారు.

News January 23, 2026

నెల్లూరు: సాగు మొదలైనా.. భూసార నివేదికలు ఎక్కడ?

image

జిల్లాలో వరి సాగు దాదాపు 5 లక్షల ఎకరాలకు పైగా జరుగుతోంది. సాగు మొదలై రెండో నెల అవుతున్నా భూసార నివేదికలు రైతన్నలకు అందలేదు. 31,231 నేల పరీక్షలు లక్ష్యం కాగా 30,785 నమూనాలు సేకరించారు. వీటిలో 23,306 శాంపిల్స్ పరీక్షించగా 14,104 SOIL హెల్త్ కార్డ్స్‌ను అందించారు. నేల స్వభావాన్ని అనుసరించి ఎరువుల వినియోగం జరగని పరిస్థితులు వెంటాడుతున్నాయి. మిగిలిన కార్డ్స్ అందించే లోపు సాగు పూర్తయ్యే అవకాశాలున్నాయి.