News June 7, 2024

నెల్లూరు జిల్లాలో ఎన్నికల కోడ్ తొలగింపు

image

ఎన్నికల కౌంటింగ్ విజయవంతగా పూర్తవడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ గురువారం సాయంత్రంతో ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. పూర్తి చిత్తశుద్ధితో పని చేసిన ఎన్నికల సిబ్బందికి, పోలీస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, విద్యుత్ సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎస్పీ సమక్షంలో నిర్వహించిన పటిష్ఠ బందోబస్తు వలన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు.

Similar News

News November 10, 2025

జిల్లా వ్యాప్తంగా హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు

image

SP డా అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 77 ప్రత్యేక బృందాలతో హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని సంతపేట పరిధిలోని ఓ లాడ్జ్‌లో ఆకస్మిక తనిఖీ చేయగా, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 6 KGల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడానికి లాడ్జిలు, హోటల్స్‌ను ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు.

News November 9, 2025

కోవూరులో స్లాబ్ కూలి కార్పెంటర్ మృతి

image

స్లాబ్ కూలి కార్పెంటర్ మృతి చెందిన ఘటన కోవూరులో చోటుచేసుకుంది. కోవూరు గ్రామంలోని లక్ష్మీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి స్లాబ్ పనులను కార్పెంటర్ పట్నం ప్రసాద్‌ (48) చేస్తుండగా ప్రమాదవశాత్తు స్లాబ్ కూలి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 9, 2025

తల్లి క్షణికావేశం.. పిల్లల పాలిట యమపాశమై.!

image

ఓ తల్లి క్షణికావేశం ఇద్దరు పిల్లల పాలిట <<18236870 >>మృత్యుపాశ<<>>మైంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మాతృమూర్తే తనతోపాటూ బిడ్డలను కాటికి తీసుకెళ్లింది. సూళ్లూరుపేట(M)లో వరలక్ష్మి(24) పిల్లలోసహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు మాధవయ్యతో ఆరేళ్ల క్రితం వివాహం అయింది. కొన్నేళ్లుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల భర్త వరలక్ష్మిని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.