News September 11, 2024

నెల్లూరు జిల్లాలో కొండెక్కిన ఉల్లి ధర

image

నెల్లూరు జిల్లాలో ఉల్లి ధర రోజురోజుకూ పెరుగుతోంది. కిలో రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక, పుణే నుంచి దిగుమతి అవుతున్న సరకు.. అక్కడే కిలో రూ.50 వరకు ఉండటంతో రవాణా ఖర్చులతో ఇక్కడికి చేరే సరికి మరింత పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో కొత్త పంట మార్కెట్‌కు రాకపోవడంతో కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వారు తెలిపారు.

Similar News

News July 7, 2025

నెల్లూరుకు చేరుకున్న మంత్రి లోకేశ్

image

నెల్లూరు పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు బొకే అందించి ఆహ్వానం పలికారు. ఈ మేరకు మంత్రి ఇవాళ VR స్కూల్ ప్రారంభోత్సవంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

News July 7, 2025

నెల్లూరులో సోమవారం మంత్రి లోకేశ్ పర్యటన వివరాలు:

image

☞ ఉ. 9 గంటలకు VR మున్సిపల్ హైస్కూల్‌ను ప్రారంబోత్సవం
☞ 11 గంటలకు సిటీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు
☞ మ.12 గంటలకు నాయకుల సమన్వయ సమావేశానికి హాజరవుతారు
☞ సాయంత్రం 4 గంటలకు బారాషాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

News July 6, 2025

మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికిన అబ్దుల్ అజీజ్

image

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గానా నెల్లూరుకు పయనమయ్యారు.