News March 24, 2026
నెల్లూరు జిల్లాలో కొత్త MLA సీట్లు ఇవేనా..?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనతో <<19461748>>MLAల సంఖ్య <<>>10 నుంచి 15కి పెరిగే అవకాశం ఉంది. 2009కి ముందు రాపూరు, అల్లూరు నియోజకవర్గాలు ఉండేవి. వీటిని పునరుద్ధరించే అవకాశం ఉంది. 8మండలాలతో ఉదయగిరి, 6మండలాలతో సూళ్లూరుపేట, ఆత్మకూరు పెద్ద నియోజకవర్గాలుగా ఉన్నాయి. వీటి విభజనతో కొత్తది ఏర్పడవచ్చు. ఓట్ల పరంగా నెల్లూరు సిటీ, రూరల్‌తో పాటు మరోక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
Similar News
News April 13, 2026
కలెక్టర్ సార్.. నెల్లూరులో వీటిపై ఓ కన్నేయండి!

నెల్లూరు జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్, ల్యాబ్ పరీక్షలు, అదనపు బెడ్స్ ఏర్పాటుకు అనుమతులు ఉండటం లేదు. అర్హత లేనివాళ్లు వైద్య సేవలు అందిస్తున్నారు. వీటితో పాటు ఆసుపత్రి భవనాల్లో ఫైర్ సేఫ్టీ ప్రశ్నార్థకంగా మారింది. ఉదయగిరిలోని ఓ హాస్పిటల్లో 13 ఏళ్లుగా ఎలాంటి అనుమతలు లేకుండా వైద్యం అందించిన విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే. వీటిపై కలెక్టర్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.
News April 13, 2026
నెల్లూరులో సిటీ బస్సులు.. ట్విస్ట్ ఇదే!

నెల్లూరులో <<19612409>>సిటీ బస్సులు <<>>తిప్పుతామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ వీటికంటూ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయలేదు. నెల్లూరు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి వచ్చే బస్సులకే టౌన్ స్టాఫింగ్ ఇచ్చారు. వాటిపై పల్లెటూరి పేర్లు ఉండటంతో టౌన్ బస్సులని చాలామందికి తెలియడం లేదు. వీటిని ఎవరూ ఆపడం లేదు. ప్రత్యేక బస్సులు వేయడం లేదా పల్లెటూర్ల వాటికే టౌన్ సర్వీసులు అని తెలిసేలా బోర్డులు పెడితే బాగుంటుంది.
News April 13, 2026
డీసీపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. 14 ఏళ్ల బాలుడు ట్రాక్టర్ డ్రైవింగ్!

మర్రిపాడు మండలం, డీసీపల్లి – ఎన్నావాడ మార్గ మధ్యలో బైక్.. ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న మహేశ్, వెంకటేశ్ అనే యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు 14 ఏళ్ల బాలుడు ట్రాక్టర్ నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు.


