News September 23, 2024

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి స్పాట్ డెడ్

image

కలిగిరి మండలం లక్ష్మీపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. కుమ్మరి కొండూరు నుంచి బైక్‌పై వస్తున్న రామస్వామి పాళెం గ్రామానికి చెందిన వడ్డే శ్రీనివాసులు, వంకదారి మాలాద్రిని లక్ష్మీపురం సమీపంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News December 30, 2024

నెల్లూరు: ‘తస్మాత్ జాగ్రత్త.. ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేస్తారు’

image

నెల్లూరు పోలీస్ గ్రౌండ్‌లో సోమవారం నుంచి నిర్వహించనున్న APSLRB పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే వారిని నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతే ప్రమాణికంగా ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్‌కు వచ్చే అభ్యర్థులు సూచించిన ధ్రువపత్రాలను తమ వెంట తీసుకురావాలని ఎస్పీ కోరారు.

News December 29, 2024

శ్రీహరికోట: రేపు పీఎస్ఎల్వీ C-60 ప్రయోగం

image

శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు PSLV- C60 రాకెట్‌ను ప్రయోగించనున్నన్నట్లు ఆదివారం పలువురు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రాకెట్ ద్వారా 440 కిలోల బరువు కలిగిన స్పాడెక్స్ పేరుతో జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. కక్ష్యలోకి వెళ్లిన ఉపగ్రహాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండి సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. దీనివల్ల భారత్‌ డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశం అవుతుందన్నారు.

News December 29, 2024

నెల్లూరు: రూ.3.96 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

image

నెల్లూరులో సైబర్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కామాటివీధికి చెందిన సాయికిరణ్ అమెరికాలో ఉంటున్నాడు. బృందావనంలోని ఓ బ్యాంకు ఖాతాలో ఇటీవల కొంత నగదు జమ చేశారు. అందులోని రూ.3.96 లక్షలను గత నెల 7న గుర్తుతెలియని వ్యక్తులు వివిధ ఖాతాలకు బదిలీ చేసినట్లు ఇటీవల గుర్తించాడు. దీంతో నెల్లూరులో ఉంటున్న తండ్రి రమేశ్ బాబు సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, చిన్నబజార్ సీఐ కోటేశ్వరరావు విచారణ చేపట్టారు.