News February 6, 2026

నెల్లూరు జిల్లాలో చమురు నిక్షేపాలు..?

image

మనుబోలు మండలం కుడితిపల్లి పొలాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం ఓఎన్జీసీ గురువారం రీ సర్వే చేసింది. ఆ సంస్థ పీఆర్వో సుధీర్ మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి శాటిలైట్ ద్వారా వచ్చిన 2డీ ఫొటోల ఆధారంగా ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మైపాడు నుంచి చెన్నూరు వరకు సర్వే చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి విడత సర్వే పూర్తి చేశామన్నారు.

Similar News

News February 11, 2026

శివరాత్రికి మైపాడు వెళ్తారా..?

image

మైపాడు బీచ్ వద్ద ఉన్న భారీ శివలింగం మహా శివరాత్రికి సిద్ధమైంది. సముద్ర తీరాన ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఈ లింగాన్ని తీర్చిదిద్దారు. మెట్ల ద్వారా పైకి వెళ్లి అభిషేకం చేసే సౌకర్యం ఉండటంతో.. శివరాత్రి నాడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. సముద్ర స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకునేందుకు పర్యాటకులు ఇక్కడకు ఆసక్తి చూపుతారు. ప్రకృతి ఒడిలో ఈ శివలింగం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ నిలవనుంది.

News February 11, 2026

నెల్లూరు బాలాజీలో లక్కీ డ్రా

image

సంక్రాంతి సందర్భంగా నెల్లూరులోని బాలాజీ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ లక్కీ డ్రా నిర్వహించింది. మొదటి బహుమతిగా నెల్లూరుకు చెందిన సత్యనారాయణ, నేలటూరుకు చెందిన నాగేశ్వరరావుకు స్కూటీలను అందజేసింది. అలాగే ఆరో స్థానం వరకు నిలిచిన వారికి ఏసీ, వాషింగ్ మెషిన్, టీవీలు, కుక్కర్లను పంపిణీ చేసింది. సంస్థ ఛైర్మన్ YD బాలాజీ చౌదరి, CEOలు సాయి నిఖిలేశ్, సాయి నితీశ్, డైరెక్టర్ రవినాయుడు పాల్గొన్నారు.

News February 11, 2026

NLR: నూతన విధానంలో ఇన్విజిలేటర్ల నియామకం

image

పది పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకం పద్ధతి మారనుంది. రాష్ట్ర విద్యాశాఖ అధికారులే బాధ్యతలు నిర్వహించనున్నారు. టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం(టిస్)లో నమోదైన వివరాల ప్రకారం విధులు కేటాయించనున్నారు. ఇక కారణాలు చెప్పి విధులకు తప్పించుకునే వీలుండదు. 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న టీచర్లు ఈ రూల్ మినహాయింపు. జిల్లాలో 174 పరీక్ష కేంద్రాలు ఉండగా.. 27,931 మంది పరీక్షలు రాయనున్నారు.