News February 28, 2026
నెల్లూరు జిల్లాలో ప్రిన్సిపల్ సూసైడ్

చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన బి.సునీల్(38) పొదలకూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి కాల్ చేస్తుంటే ఆయన లిఫ్ట్ చేయలేదు. బంధువులు ఫోన్ లొకేషన్ ఆధారంగా వెతకగా.. మడమనూరు సమీపంలో విషం తాగి పడిపోయినట్లు గుర్తించారు. చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించగా శుక్రవారం చనిపోయారు. అప్పులు, వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.
Similar News
News March 3, 2026
ఇందుకూరుపేట: వేటకు వెళ్లి ఒకరు మృతి

ఇందుకూరుపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గంగపట్నం ఎస్సీ కాలనీకి చెందిన ఏలూరు వెంకటరమణయ్య చేపల వేట కోసం సమీపంలోని ఉప్పుటేరుకు వెళ్లారు. అక్కడ వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆయనను బయటకు తీశారు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే వెంకటరమణయ్య ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
News March 3, 2026
నెల్లూరు: ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు

తన వెంటపడి ప్రేమిస్తున్నానని చెప్పి తనను శారీరకంగా బలవంతంగా వాడుకొని మోసం చేశాడని విడవలూరుకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడవలూరు మన్మధరావుపేటకు చెందిన చంచల ప్రవీణ్ కుమార్ ప్రేమ పేరుతో తనను బలవంతంగా వాడుకుని తన బంధువులు వారి తల్లిదండ్రులను పెళ్లి చేసుకోవాలని అడిగితే అవమానించారని విడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News March 3, 2026
నెల్లూరు: స్పెషల్ డ్రైవ్ పెడుతున్నా.. శృతి మించుతున్నారు

జిల్లాలో పోలీసులు ఎప్పటికప్పుడు నాకా బందీలు చేపడుతున్నా.. ఎక్కడికక్కడ శృతి మించుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల చేపట్టిన పలు సందర్బల్లో కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా.. 57 లాడ్జిలను, 1694 వాహనాలను తనిఖీ చేయగా.. 20 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో 28 మంది పట్టుబడ్డారు. నిభందనలు పాటించనివారిపై 157 కేసులు నమోదు చేశారు. రూ. 1.52 లక్షలు జరిమానా విధించారు.


