News October 16, 2024
నెల్లూరు జిల్లాలో రేపు సెలవు

నెల్లూరు జిల్లాలో గురువారం కూడా భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలలకు రేపు కూడా సెలవు ప్రకటించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు. మరోవైపు రేపు నెల్లూరు-పుదుచ్చేరి మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.
Similar News
News November 4, 2025
నెల్లూరు: బీటెక్ చదివి దొంగతనాలు

నెల్లూరులో నిన్న ఓ <<18189275>>దొంగ పట్టుబడిన <<>>విషయం తెలిసిందే. అల్లూరు(M) జమ్మిపాలేనికి చెందిన శ్రీనాథ్ 2009లో బీటెక్(సివిల్) పూర్తి చేశాడు. ప్రస్తుతం నెల్లూరులోని ఓ థియేటర్‌లో పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ క్యాసినో ఆడుతూ జీతం మొత్తం దానికే పెడుతున్నాడు. ఈజీ మనీకి అలవాటు పడి చైన్ స్నాచింగ్, బైకుల దొంగతనాలు మొదలు పెట్టాడు. గతనెల 23న చాకలి వీధిలో జరిగిన కేసులో దొరకగా.. 7బైకులు, రెండు చైన్లు రికవరీ చేశారు.
News November 4, 2025
నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి జోగి

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు అతని సోదరుడు జోగి రాములను నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి తరలించారు. విజయవాడ జైల్లో ఉన్న వారిద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకురాగా.. జైలు వద్ద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా జోగి రమేష్‌ని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆలింగనం చేసుకున్నారు.
News November 3, 2025
నెల్లూరు: మా మొర ఆలకించండి సారూ..!

క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే ప్రజలు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. అర్జీలు ఇస్తున్నారు తప్పితే అవి పరిష్కారం కావడానికి మరలా కిందిస్థాయికి వెళ్లాల్సి వస్తుంది. రామాయపట్నం పోర్టుకు భూములిచ్చిన ఓ రైతుకు ఇవ్వాల్సిన పరిహారం తన ఖాతాలో కాకుండా మరొక రైతు ఖాతాలో జమయిందని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కానీ ఆ సమస్య అలానే ఉండిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.


