News January 8, 2026
నెల్లూరు జిల్లాలో లైసెన్సులు లేకుండానే..!

నెల్లూరు జిల్లాలో 165 kM మేర సముద్ర తీరం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఇస్కపాలెం, మైపాడు, కృష్ణపట్నం తదితర చోట్ల రొయ్యల చెరువులు ఉన్నాయి. ఎక్కువ భాగం ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తుండగా.. వాటికి మత్స్యశాఖ నుంచి లైసెన్సులు లేవు. అధికారికంగా 23వేల ఎకరాలే సాగు ఉండగా.. అనధికార చెరువులకు సైతం కరెంటు వాడుతున్నారు. మామూళ్ల మత్తులో మత్స్యశాఖ అధికారులు లైసెన్సులను చెక్ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.
Similar News
News January 9, 2026
నెల్లూరు జిల్లావ్యాప్తంగా రేపు, ఎల్లుండి వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో శని, ఆదివారాలలో జిల్లావ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అయితే జనవరిలో సాధారణంగా వర్షాలు పడవు. కానీ వాయుగుండం ఏర్పడటం, వర్షాలు కురవడం చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఏర్పడింది.
News January 9, 2026
నెల్లూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

నెల్లూరు రూరల్ పరిధిలో ఇంటిని అద్దెకు తీసుకుని కొందరు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. ద్వారకామయి నగర్లోని నూతన లేఅవుట్లోని ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ వేణు తెలిపారు.
News January 8, 2026
NLR: వృద్ధాశ్రమాలకు అనుమతులు ఉండాల్సిందే..!

నెల్లూరు జిల్లాలో వృద్ధాశ్రమాల నిర్వహణకు స్వచ్ఛంద సేవా సంస్థలు తప్పనిసరిగా అనుమతులు పొందాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు అహ్మద్ అయూబ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అనుమతులు లేని వయోవృద్ధుల ఆశ్రమాలపై 2007 వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరిన్ని వివరాలకు నెల్లూరులోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.


