News October 5, 2025
నెల్లూరు జిల్లాలో వింత జ్వరాలు..!

నెల్లూరులో వింత జ్వరాలు కలకలం రేపుతున్నాయి. ఓ రకమైన కీటకం కుట్టడంతో వెంకటేశ్వరపురం, కావలి, ఎన్టీఆర్ నగర్, మనుబోలు ప్రాంతాల్లో స్క్రబ్ టైపస్ జ్వరం కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలను ఈ కొత్త రకం జ్వరం భయపెడుతోంది. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమని.. ఎలాంటి జ్వరం వచ్చినా వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Similar News
News October 5, 2025
నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న నేరాలు

మహిళలపై జరుగుతున్న నేరాల్లో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో 7వస్థానంలో ఉన్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ-2023 నివేదిక స్పష్టం చేస్తోంది. అత్యాచారం చేసి ఇద్దరిని హతమార్చారు. అదనపు కట్నం వేధింపులతో 6మంది చనిపోయారు. అత్తింటి వారి వేధింపులపై 507, అత్యాచారాలపై కేసులు 13, చిన్నారులపై వేధింపు కేసులు 121 నమోదయ్యాయి. 69 పోక్సో కేసులు, 585 మహిళల మిస్సింగ్ కేసులు ఫైలయ్యాయి.
News October 5, 2025
నెల్లూరు DEO హెచ్చరికలు ఇవే..!

హైకోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలోని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో ఎటువంటి టాలెంట్ టెస్ట్ నిర్వహించరాదని DEO డాక్టర్ ఆర్.బాలాజీ రావు స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఆయా పాఠశాలలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, హెచ్ఎంలకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
News October 5, 2025
KHOJ టూల్, సైబర్ నేరాలపై అవగాహన

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా KHOJ టూల్, సైబర్ నేరాలపై జిల్లా పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ డా. అజిత వేజెండ్ల నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.