News January 3, 2026

నెల్లూరు జిల్లాలో 19 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నెల్లూరు జిల్లాలోని KGBVలో 19 బోధనేతర పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో కోరారు. శనివారం నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ అప్లికేషన్లను నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో అందజేయాలని కోరారు.

Similar News

News February 9, 2026

నెల్లూరులో ఎవరి దారి వారిదే..!

image

TDP లో సమిష్టి న్యాయకత్వం మసక బారుతోంది. ఇటీవల ఓ సీనియర్ నేత విషయంలో ఇదే నిజమవుతుందని తెలుస్తోంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి MLA సోమిరెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తూ తిట్ల పురాణం చేస్తున్నా తోటి TDP నేతలకు అది పట్టడం లేదు. సోమిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు, కాకాణిపై ఎదురుదాడికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అని పలువురు చర్చించుకుంటున్నారు.

News February 9, 2026

175 నియోజకవర్గాల ర్యాంకింగ్.. కావలి లాస్ట్.!

image

ఏపీలో వివిధ అంశాల్లో 175 నియోజకవర్గాల్లో వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది. A+ గ్రేడ్లో 21, A గ్రేడ్లో 153, B గ్రేడ్లో ఒక నియోజకవర్గం ఉన్నాయి. అలాగే, 90 % కంటే ఎక్కువ మార్కులు సాధించి A+ ప్లస్ గ్రేడ్ దక్కించుకున్నవి 21 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కావలి(78) చివరి నుంచి మూడోస్థానం, కందుకూరు(78) మార్కులతో రాష్ట్రంలో చివరి నుంచి నాలుగో స్థానానికి పడిపోయాయి.

News February 9, 2026

వెట్టి చాకిరి నిర్మూలన పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్, ఎస్పీ

image

వెట్టి చాకిరి నిర్మూలన చట్టానికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా అజిత వేజెండ్ల ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. వెట్టి చాకిరి వంటి అమానుషమైన ఆచారాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు రూపొందించిన వెట్టి చాకిరి నిర్మూలన చట్టము- 1976 అమల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 09 తేదీని వెట్టి చాకిరి నిర్మూలన దినంగా పాటించబడిందన్నారు.