News January 1, 2026
నెల్లూరు జిల్లాలో 25మందికి జైలుశిక్ష

జిల్లాలో 18 ఏళ్ల లోపు ఉన్నవారిపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో కేసులు నమోదు చేస్తున్నారు. 2025లో 15 పోక్సో, రేప్ కేసులు నమోదయ్యాయి. 8 మర్డర్ కేసులు ఫైల్ చేశారు. ఇతర కేసులు 2 నమోదయ్యాయి. వీరిలో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి కఠిన కారాగార శిక్ష 20 ఏళ్లు, నలుగురికి 10 ఏళ్లు జైలుశిక్ష విధించారు. 5 నుంచి 10 ఏళ్ల మధ్య జైలుశిక్ష ఏడుగురికి పడింది. మొత్తంగా 25మంది జైలుకు వెళ్లారు.
Similar News
News January 2, 2026
వెంకటాచలంలో దారుణం.. కొడుకుని హత్య చేసిన తండ్రి

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం, కంటేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి రమణయ్య తన కొడుకు రఘురామయ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు చేసేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 2, 2026
నెల్లూరు జిల్లాలో 16 పీడీ యాక్టులు

నెల్లూరులో 2025లో గంజాయి బ్యాచ్‌కు ఓ వ్యక్తి బలయ్యాడు. అరుణ తర్వాత మరో లేడీ డాన్ కామాక్షి వెలుగులోకి వచ్చింది. వరుస నేరాలపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. దీంతో పోలీసులు ఎక్కడిక్కడ రౌడీషీట్లు తెరిచారు. 3కంటే ఎక్కువ కేసులు ఉన్నవారిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2025లో మొత్తం 16 మందిపై పీడీయాక్ట్, 34మందిపై గంజాయి కేసులు నమోదు చేసి 102 మందిని రిమాండ్‌కు పంపారు. 510 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
News January 2, 2026
నెల్లూరు: మీకు పాస్ బుక్ వచ్చిందా..?

నెల్లూరు జిల్లాలో ఈనెల 9వ తేదీ వరకు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో రీసర్వే చేశారు. భూ వివాదాలను పరిష్కరించి కొత్తగా పాస్ పుస్తకాలు ముద్రించారు. రాజముద్రతో ఉన్న వీటిని గ్రామ సభలు నిర్వహించి ప్రజాప్రతినిధుల ద్వారా రైతులకు అందజేస్తున్నారు. జిల్లాకు మొత్తం 1.05 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు చేరాయి. ఈ కొత్త పుస్తకాలు మీకు అంది ఉంటే కామెంట్ చేయండి.


